Share News

AP NEWS: దిశా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - Jan 10 , 2024 | 09:57 PM

దిశా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కట్టుకున్న భార్యని వేధిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై జిల్లా ఎస్పీ పి జాషువా సస్పెండ్ కొరడా ఝులిపించారు. 2018లో ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం కానిస్టేబుల్ రవి కిరణ్ మండవల్లి వెళ్లారు.

AP NEWS: దిశా కానిస్టేబుల్‌పై  సస్పెన్షన్ వేటు

కృష్ణాజిల్లా (మచిలీపట్నం): దిశా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కట్టుకున్న భార్యని వేధిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై జిల్లా ఎస్పీ పి జాషువా సస్పెండ్ కొరడా ఝులిపించారు. 2018లో ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం కానిస్టేబుల్ రవి కిరణ్ మండవల్లి వెళ్లారు. అదే డ్యూటీకి వెళ్లిన వీఆర్వో పూజితవిమలాదేవితో రవి కిరణ్‌కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. విమలాదేవికి అప్పటికే వివాహం కావడంతో వీరి విషయం తెలిసి భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో విమలాదేవిని కానిస్టేబుల్ రవి కిరణ్ వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా విమలాదేవిని మానసికంగా, శారీరకంగా రవికిరణ్ వేధిస్తున్నాడు. రవికిరణ్ వేధింపులు భరించలేక చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు కావడంతో విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ జాషువా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 10 , 2024 | 09:57 PM