Share News

BJP: ఏపీలో పొత్తులపై పురందేశ్వరి ఏమన్నారంటే...

ABN , Publish Date - Feb 11 , 2024 | 02:01 PM

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ఆదివారం విజయవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్దంతి సందర్బంగా ఆమె పుష్పగుచ్చములుంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

BJP: ఏపీలో పొత్తులపై పురందేశ్వరి ఏమన్నారంటే...

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ఆదివారం విజయవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్దంతి సందర్బంగా ఆమె పుష్పగుచ్చములుంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పొత్తుపై ముగ్గురు నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా భేటీపై సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టామని, పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురందేశ్వరి స్పష్టం చేశారు.

Updated Date - Feb 11 , 2024 | 02:01 PM