Share News

Fire accident: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు

ABN , Publish Date - May 26 , 2024 | 09:50 AM

గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలయిన ఘటన బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పిన్టెక్స్ క్వార్టర్స్‌లో జరిగింది. కార్మికులు షిఫ్ట్ దిగి క్వార్టర్స్‌కి వెళ్లి వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు.

Fire accident: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
bapatla fire accident

కృష్ణాజిల్లా, మే 26: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలయిన ఘటన బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పిన్టెక్స్ క్వార్టర్స్‌లో జరిగింది. కార్మికులు షిఫ్ట్ దిగి క్వార్టర్స్‌కి వెళ్లి వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు.


అసలేం జరిగిందంటే...!

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌కు చెందిన కార్మికులు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పిన్టెక్స్ క్వార్టర్స్‌లో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. రోజువారి లాగానే పని ముగించుకుని క్వార్టర్స్‌లోకి వెళ్లారు. వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగా కాసేపటికే ఒక్కసారిగా పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు కాగా హుటాహుటిన వారిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను విజయవాడకు తరలించారు.

ఇది కూడా చదవండి:

AP Elections: వైసీపీ నేతలు... యువతులతో అర్ధనగ్న డ్యాన్సులా? సిగ్గు సిగ్గు..!

Updated Date - May 26 , 2024 | 10:00 AM