Chandrababu: ఈనెల 7న తిరువూరులో చంద్రబాబు పర్యటన
ABN , Publish Date - Jan 02 , 2024 | 09:59 PM
తిరువూరులో ఈ నెల7వ తేదీన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పర్యటించనున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కేడర్‌కి దిశారిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించనున్నారు.
తిరువూరు: తిరువూరులో ఈ నెల7వ తేదీన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పర్యటించనున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కేడర్‌కి దిశారిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించనున్నారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు అయ్యప్ప స్వామి దేవస్థానం పక్కన ఉన్న సభ స్థలాన్ని ఇన్‌చార్జి పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. అనంతరం హెలిప్యాడ్ పార్కింగ్ స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, పెందుర్తి వెంకటేష్, టీడీపీ ఇంచార్జీ శావల దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, టీడీపీ నేతలు పరిశీలించారు.