Share News

Anganwadi Strike: ‘మాకు ఆరు నెలలు.. మీకు నెలరోజులే’.. ఎస్మా ప్రయోగించాడాన్ని ఖండించిన అంగన్వాడీలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 02:02 PM

Andhrapradesh: అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ జీవో జారిచేసింది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు మాట్లాడుతూ.. 26 రోజులుగా సమ్మె చేస్తున్నామని.. ప్రభుత్వానికి తాము గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.

Anganwadi Strike: ‘మాకు ఆరు నెలలు.. మీకు నెలరోజులే’.. ఎస్మా ప్రయోగించాడాన్ని ఖండించిన అంగన్వాడీలు

విజయవాడ, జనవరి 6: అంగన్వాడీల సమ్మెపై (Anganwadi Strike) ఏపీ ప్రభుత్వం (AP Government) ఎస్మా ప్రయోగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు మాట్లాడుతూ.. 26 రోజులుగా సమ్మె చేస్తున్నామని.. ప్రభుత్వానికి తాము గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎస్మాకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తాము వేతనాలు, హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. అంగన్వాడీలకు అత్యవసర సర్వీసులు వర్తించవన్నారు. ఫౌష్టికాహారం గర్భిణీలకు ఎంత అవసరమో అంగన్వాడీలకు అంతే అవసరమన్నారు.

‘‘ఆరు నెలల పాటు నిరసనలు, ధర్నాలు చేయవద్దని చెప్పడానికి మీరు ఆరు నెలలు ప్రభుత్వంలో ఉండాలి కదా. మాకు ఆరునెలల సమయం.. మహా అయితే నెల రోజుల పాటు మీరు అధికారంలో ఉంటారు. మీ ఎస్మాలకు భయపడేది లేదు.. మా సమ్మె ఆగదు... అవసరమైతే లీగల్‌గానే ఎదుర్కొంటాం. ప్రభుత్వం చర్చలకి పిలవాలి.. మా వేతనాల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే సమ్మెను మరింత‌ ఉధృతం చేస్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలుపుతాం’’ అని యూనియన్ నేతలు స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 06 , 2024 | 02:02 PM