Share News

AP Politics: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు షాక్.. అసెంబ్లీ అధికారుల కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Jan 31 , 2024 | 06:35 PM

Notice to YSRCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికారులు. పార్టీ ఫిరాయింపుపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లకు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేశారు

AP Politics: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు షాక్.. అసెంబ్లీ అధికారుల కీలక ఆదేశాలు..
AP Politics

అమరావతి, జనవరి 31: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికారులు. పార్టీ ఫిరాయింపుపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లకు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేశారు శాసనసభ అధికారులు. వైసీపీ గుర్తుపై గెలిచి.. విప్‌ను దిక్కించిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ చీఫ్ విప్ ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా అసెంబ్లీ అధికారులు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. సోమవారం నాడు విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు.. వివరణ ఇచ్చేందుకు తమకు కొంత గడువు కావాలని కోరారు. ఇందుకు నిరాకరించిన స్పీకర్ మూడు వాయిదా తరువాత నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. మరోసారి నోటీసులు జారీ చేశారు.

ఫిబ్రవరి 8న స్పీకర్ ముందు విచారణ..

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు బుధవారం నాడు మరోసారి నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ కార్యాలయ అధికారులు. ఫిబ్రవరి 5వ తేదీ లోపు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. కాగా, మొన్న జరిపిన విచారణలో కొంతమంది సభ్యులు.. తమకు పంపిన సీడీలు, పెన్ డ్రైవ్‌లు ఓపెన్ కావడం లేదని చెప్పినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. మళ్లీ ఎమ్మెల్యేల పరిశీలన కోసం పెన్ డ్రైవ్‌లు, సీడీలు పంపుతున్నామని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. వీటిని ఓపెన్ చేయడంలో ఎలాంటి సాయం అవసరం అయినా శాసనసభ కార్యదర్శి కార్యాలయాన్ని సంప్రదించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. విచారణకు ఖచ్చితంగా హాజరవ్వాలని ఎమ్మెల్యేలకు నోటీసుల్లో స్పష్టం చేసింది స్పీకర్ కార్యాలయం.

Updated Date - Jan 31 , 2024 | 06:35 PM