Share News

AP Elections: ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాలో అధికారుల కీలక నిర్ణయం..

ABN , Publish Date - May 31 , 2024 | 01:43 PM

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాకు చెందని పోలీస్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కడపలోని రౌడీషీటర్లను జిల్లా బహిష్కరణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లా నుంచి 21 మంది రౌడీ షీటర్లను బహిష్కరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1038 మందిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు.

AP Elections: ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాలో అధికారుల కీలక నిర్ణయం..

కడప: ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాకు చెందని పోలీస్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కడపలోని రౌడీషీటర్లను జిల్లా బహిష్కరణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లా నుంచి 21 మంది రౌడీ షీటర్లను బహిష్కరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1038 మందిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. 652 మందిని పోలీసులు ముందస్తు అరెస్టు చేయనున్నారు. అలాగే131 మందిని గృహనిర్బంధం చేయనున్నారు. కడప, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల నుంచి మొత్తంగా 21 మందిని బహి ష్కరించనున్నారు.

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..


రేపు ఉదయం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలో ఉండ కూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రౌడీషీటర్‌లు అందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం నుంచి జిల్లా వదలాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో 600 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. 110 మందిని రౌడీషీటర్లను పోలీసులు గృహ నిర్బంధం చేయనున్నారు. అన్నమయ్య జిల్లాలో ఆరుగురు రౌడీషీటర్లను జిల్లా బహిష్కరణ చేయనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పొన్నవోలు వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో..

రాష్ట్ర గీతం జాతికి అంకితం: రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Updated Date - May 31 , 2024 | 01:43 PM