Share News

Kesineni Chinni: బెజవాడలో హీట్ పుట్టించిన కేశినేని చిన్ని నామినేషన్ ర్యాలీ..

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:06 PM

బెజవాడలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్) నామినేషన్ ర్యాలీ హీట్ పుట్టించింది, ఎండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా చిన్ని ర్యాలీకి ప్రజానీకం మద్దతు తెలిపింది. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా వివిధ వర్గాలకు చెందిన మహిళలు నిలిచారు. చిన్నికి అడుగడుగునా జన నీరాజనాలు పలికారు. ఎక్కడికక్కడ హారతులు ఇచ్చి మహిళలు స్వాగతం పలుకుతున్నారు.

Kesineni Chinni: బెజవాడలో హీట్ పుట్టించిన కేశినేని చిన్ని నామినేషన్ ర్యాలీ..

విజయవాడ: బెజవాడలో టీడీపీ (TDP) పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్) నామినేషన్ ర్యాలీ హీట్ పుట్టించింది, ఎండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా చిన్ని ర్యాలీకి ప్రజానీకం మద్దతు తెలిపింది. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా వివిధ వర్గాలకు చెందిన మహిళలు నిలిచారు. చిన్నికి అడుగడుగునా జన నీరాజనాలు పలికారు. ఎక్కడికక్కడ హారతులు ఇచ్చి మహిళలు స్వాగతం పలుకుతున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కార్మిక సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు మద్దతు పలికారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి కేశినేని చిన్ని నివాళులర్పించారు.

అనుమతులు లేకుండా ‘సిద్ధం’ ఫ్లెక్సీలు


ఇక కేశినేని కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు ఉత్సాహం అంతా ఇంతా కాదు. విజయవాడ అడ్డా కేశినేని చిన్ని అడ్డ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు సార్లు తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచిన వారి కార్యాలయం వెలవెలబోతోందంటూ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా నినాదాలు చేశారు. కేశినేని చిన్ని 2 లక్షల మెజార్టీతో గెలుస్తారంటూ కేశినేని నాని కార్యాలయం ఎదుట బుద్దా వెంకన్న సవాలు విసిరారు. కేశినేని చిన్ని ర్యాలీకి బందర్ రోడ్డు మీదగా అనుమతి తీసుకుంటే పోలీసులు అనుమతిని నిరాకరించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని ఏలూరు రోడ్డు, మ్యూజియం రోడ్డు మీదగా చిన్ని ర్యాలీకి అనుమతిచ్చారు.

ఇవి కూడా చదవండి...

AP Politics: మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..

Chandrababu: విజయనగరం జిల్లాకు చంద్రబాబు.. పవన్‌

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 11:55 AM