Share News

Pawan Kalyan: హెలీకాప్టర్ ల్యాండింగ్ కు నిరాకరణ.. హైకోర్టుకు వెళ్లాలని పవన్ నిర్ణయం..

ABN , Publish Date - Feb 14 , 2024 | 02:45 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అయితే.. ఆయన ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లేదంటూ ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు.

Pawan Kalyan: హెలీకాప్టర్ ల్యాండింగ్ కు నిరాకరణ.. హైకోర్టుకు వెళ్లాలని పవన్ నిర్ణయం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అయితే.. ఆయన ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లేదంటూ ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. ఫలితంగా పవన్ కల్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. హెలీకాప్టర్ దిగేందుకు అనుమతులు ఇవ్వకపోవడంపై హైకోర్ట్ ను ఆశ్రయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ లీగల్ సెల్ కు ఆదేశాలు ఇచ్చారు.

భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో జరగాల్సిన సమావేశాలు పార్టీ కేంద్ర కార్యాలయంలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమవరంలోని విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద దిగేందుకు కళాశాల యాజమాన్యం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే అక్కడ ల్యాండింగ్ కు అనువుగా ఉండదంటూ ఆర్ అండ్ బీ అధికారులు అనుమతి నిరాకరించడం గమనార్హం.

WhatsApp Image 2024-02-14 at 2.29.10 PM.jpeg

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 02:45 PM