Share News

Shravan Kumar: జాబ్ క్యాలెండర్ పేరిట యువతను జగన్ వెర్రివాళ్లను చేశాడు

ABN , Publish Date - Jan 06 , 2024 | 02:46 PM

జాబ్ క్యాలెండర్ పేరిట సీఎం జగన్ ( CM JAGAN ) యువతను వెర్రివాళ్లను చేశాడని మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ( Tenali Shravan Kumar ) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని.. ఆయన్ని నమ్ముకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి, వై.వీ.సుబ్బారెడ్డి వంటి కొద్దిమంది రెడ్లు ఉన్నారని చెప్పారు. 58 నెలల జగన్‌రెడ్డి పాలన దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలు వంచనకు ప్రతిరూపంగా నిలిచిందని తెనాలి శ్రావణ్ కుమార్ చెప్పారు.

Shravan Kumar:  జాబ్ క్యాలెండర్ పేరిట యువతను జగన్  వెర్రివాళ్లను చేశాడు

అమరావతి: జాబ్ క్యాలెండర్ పేరిట సీఎం జగన్ ( CM JAGAN ) యువతను వెర్రివాళ్లను చేశాడని మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ( Tenali Shravan Kumar ) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని.. ఆయన్ని నమ్ముకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి, వై.వీ.సుబ్బారెడ్డి వంటి కొద్దిమంది రెడ్లు ఉన్నారని చెప్పారు. 58 నెలల జగన్‌రెడ్డి పాలన దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలు వంచనకు ప్రతిరూపంగా నిలిచిందన్నారు. బటన్ నొక్కుడు పేరుతో ప్రజలకు ఇచ్చింది రూ.2.50లక్షల కోట్లని... జగన్, వైసీపీ నేతలు కాజేసింది రూ.5.50లక్షల కోట్లని చెప్పారు. ప్రజలపై, రాష్ట్రంపై జగన్ మోపిన అప్పుల భారం రూ.11లక్షల కోట్లని తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు.

జగన్‌ మహిళలను వంచనకు గురిచేశారు

జగన్‌రెడ్డిని నమ్మినందుకు ప్రజలు నయవంచనకు గురయ్యారని.. పేదలు మరింత దిగజారి కడుబీదలుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు హామీని నమ్మి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మోసపోయారన్నారు. మద్యపాన నిషేధం మాట నమ్మి మహిళలు వంచనకు గురయ్యారని చెప్పారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ, ప్రత్యేకహోదా అంటూ జగన్‌రెడ్డి యువతను మోసగించారన్నారు. రుణమాఫీ, గిట్టుబాటుధరల పేరుతో రైతుల్ని, వడ్డీలేని రుణాలని చెప్పి డ్వాక్రా మహిళలను మోసగించాడని చెప్పారు. జగన్ పాలనలో మోసపోని వర్గం.. వంచనకు గురికాని వ్యక్తే లేడని అన్నారు. సొంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కూడా జగన్‌రెడ్డి బాధితులుగానే మిగిలారని తెనాలి శ్రావణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 06 , 2024 | 02:58 PM