Share News

TDP: పింఛన్లు ఇవ్వలేకనే జగన్ కొత్త నాటకానికి తెర: ఎమ్మెల్యే అనగాని

ABN , Publish Date - Mar 31 , 2024 | 11:06 AM

అమరావతి: సీఎం జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించిందని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ సంక్షేమ పథకాలు ఆపమని చెప్పిందా? అని ప్రశ్నించారు.

TDP: పింఛన్లు ఇవ్వలేకనే జగన్ కొత్త నాటకానికి తెర: ఎమ్మెల్యే అనగాని

అమరావతి: సీఎం జగన్ రెడ్డి (CM Jagan) స్వార్థ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ (Pensions Distribution) బాధ్యత నుంచి వాలంటీర్లను (Volunteers) ఎన్నికల కమిషన్ (EC) తప్పించిందని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ (MLA Anagani Satya Prasad) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ సంక్షేమ పథకాలు ఆపమని చెప్పిందా?.. సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దు అనే కదా చెప్పిందని అన్నారు. ప్రభుత్వ ఖాజానాలో చిల్లి గవ్వ లేదని.. పెన్షన్లు ఇవ్వలేకనే జగన్ (CM Jagan) కొత్త నాటకానికి తెరతీసారని విమర్శించారు. ఈసీ మీద వంకతో ఈ నెల పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి ముసలోళ్ళ నోట్లో మట్టి కొట్టాలన్నదే జగన్ రెడ్డి కుట్ర అని ఆరోపించారు. ఒక్క పించన్ కూడా ఆగనివ్వమని, చివరి లబ్దిదారునికి పింఛన్ ఇచ్చే వరకు వైసీపీని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్ కాగా, 200 రూపాయల పెన్షన్‌ను పదిరెట్లు పెంచి రూ. 2వేలు చేసింది చంద్రబాబు అని, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచి, ఇంటివద్దకే అందిస్తామని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు.

కాగా పెన్షన్ల పంపిణీ బాధ్యతను వలంటీర్ల నుంచి తప్పించినప్పటికీ లబ్ధిదారులకు యథావిధిగా ఇంటి వద్దనే అందజేయనున్నారు. అయితే, జిల్లాలో ఏప్రిల్‌ నెల సామాజిక పింఛన్లు 3, 4 తేదీల తర్వాత అందనున్నాయి. ఇప్పటివరకు వలంటీర్ల బయోమెట్రిక్‌ ఆధారంగా పింఛన్లు ఇస్తూ వచ్చారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు వలంటీర్లు పింఛన్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ద్వారా వీటిని అందజేయనున్నారు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి పింఛన్‌ ఇస్తారు. ఇప్పటివరకు లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకునేవారు కాదు. ప్రస్తుతం సంతకాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు ఎంతమందికి పింఛన్లు అందజేయాలనే అంశంపై పూర్తిస్థాయిలో నివేదికను సిద్ధం చేస్తామని, దీనిపై సోమవారం నాటికి ఓ స్పష్టత వస్తుందని డీఆర్‌డీఎ పీడీ పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Mar 31 , 2024 | 11:06 AM