Share News

TDP,, విశాఖ పోర్టులో ఏపీ అధికారులకు ఏంపని?: పట్టాభి

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:30 PM

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విశాఖపట్టణం పోర్టులో ఏపీ సీనియర్ అధికారులకు ఏంపని అని ప్రశ్నించారు. జగన్ మోచేతినీళ్లు తాగే అధికారులకు అక్కడ ఏం పని అని ఆయన నిలదీశారు. సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తుంటే వారు ఎందుకు అడ్డుకున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP,, విశాఖ పోర్టులో ఏపీ అధికారులకు ఏంపని?: పట్టాభి

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విశాఖపట్టణం పోర్టులో ఏపీ సీనియర్ అధికారులకు ఏంపని అని ప్రశ్నించారు. జగన్ మోచేతినీళ్లు తాగే అధికారులకు అక్కడ ఏం పని అని ఆయన నిలదీశారు. సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తుంటే వారు ఎందుకు అడ్డుకున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటెయినర్‌లో 25 వేల కిలోల ఈస్ట్‌తో పాటు డ్రగ్స్‌ వస్తున్నాయని ఇంటర్‌పోల్‌ నుంచి ఈ నెల 18న సీబీఐకి సమాచారం వచ్చింది. అప్పటికి రెండు రోజుల ముందే ఆ నౌక ఇక్కడి కంటెయినర్‌ టెర్మినల్‌కు చేరింది. సీబీఐ అధికారులు మరుసటిరోజే (19వ తేదీ మంగళవారం) లాసన్స్‌బే కాలనీలోని సంధ్య ఆక్వా ఆఫీసుకు వెళ్లి కంటెయినర్‌పై అనుమానాలు ఉన్నాయని విచారణకు రావాలని కోరారు. విజిలెన్స్‌ అధికారులను కూడా తీసుకువెళ్లారు. సంధ్య సంస్థ తరపున వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌వీఎల్‌ఎన్‌ గిరిధర్‌, ఆయనతో పాటు తోడుగా పూరీ శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్‌, కె.భరత్‌కుమార్‌లు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అందరి ముందు కంటెయినర్‌ని తెరిచారు. అందులో ఒక్కోటి 25 కేజీల బరువున్న వేయి సంచులను 20 పాలెట్లలో సర్దారు. ఒక్కో పాలెట్‌ నుంచి ఒక సంచిని సీబీఐ అధికారులు పరీక్షించారు. వాటిలో మత్తు పదార్థం ‘కొకైన్‌’ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 12:30 PM