AP NEWS: కృష్ణా ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టులో విచారణ
ABN , Publish Date - Jan 12 , 2024 | 04:45 PM
రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ ( Krishna Tribunal ) పై సుప్రీంకోర్టు ( Supreme Court ) లో శుక్రవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణ ట్రిబ్యునల్ విచారణను కొనసాగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఢిల్లీ: రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ ( Krishna Tribunal ) పై సుప్రీంకోర్టు ( Supreme Court ) లో శుక్రవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణ ట్రిబ్యునల్ విచారణను కొనసాగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబరు 6వ తేదీన కేంద్రం నూతన విధివిధానాలతో కూడిన గెజిట్ ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుపట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులుగా ఉన్న కేంద్రం, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు నోటీసులకు కేంద్ర జలశక్తి శాఖ స్పందించింది. ఏపీ ప్రభుత్వం పిటిషన్‌కు జలశక్తి శాఖ కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం రెండు వారాలు పాటు వాయిదా వేసింది. కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ వాద, ప్రతివాదులకు ఇంకా అందక పోవడంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.