Share News

Crime: బాపట్ల జిల్లా: వృద్ధిడిపై ఎస్ఐ దాడి..

ABN , Publish Date - Mar 20 , 2024 | 01:18 PM

బాపట్ల జిల్లా: బల్లికురవలో ఓ పోలీస్ అధికారి రెచ్చిపోయాడు. ఓ వృద్ధిడిపై ఝులుం ప్రదర్శించాడు. శానంపూడి హనుమంతురావు అనే వృద్ధిడిపై బల్లికురవ ఎస్ఐ శివనాగిరెడ్డి దాడి చేశాడు. వృద్ధుడు బల్లికురవలో బడ్డీకొట్టు నడుపుకుంటున్నాడు. మద్యం అమ్ముతున్నాడని ఆరోపిస్తూ...

Crime: బాపట్ల జిల్లా: వృద్ధిడిపై ఎస్ఐ దాడి..

బాపట్ల జిల్లా: బల్లికురవలో ఓ పోలీస్ అధికారి (Police Officer) రెచ్చిపోయాడు. ఓ వృద్ధిడిపై (Old Man) ఝులుం ప్రదర్శించాడు. శానంపూడి హనుమంతురావు అనే వృద్ధిడిపై బల్లికురవ ఎస్ఐ శివనాగిరెడ్డి (SI Shivanagi Reddy) దాడి (Crime) చేశాడు. వృద్ధుడు బల్లికురవలో బడ్డీకొట్టు నడుపుకుంటున్నాడు. మద్యం (Liquor) అమ్ముతున్నాడని ఆరోపిస్తూ ఎస్ఐ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బడ్డీకొట్టులో నీళ్లు, పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు హనుమంతరావు తెలిపాడు. టీడీపీ (TDP) సానుభూతిపరుడు అనే కారణంతో ఎస్ఐ దాడిచేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల తనిఖీల్లో మద్యం దొరకలేదని చెబుతున్నారు. కేవలం టీడీపీ సానుభూతి పరుడనే కారణంతో ఎస్ఐ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని టీడీపీ శ్రేణులు ఆరోపించారు.

Updated Date - Mar 20 , 2024 | 01:18 PM