Share News

Satyakumar: ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా వైసీపీ మార్చింది

ABN , Publish Date - Aug 24 , 2024 | 02:12 PM

ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపణలు చేశారు. ప్రజల ఆదరాభిమానాలు ఉంటేనే రాజకీయాల్లో గెలుపు సాధ్యమవుతుందని తెలిపారు.

Satyakumar: ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా  వైసీపీ మార్చింది
Satyakumar

గుంటూరు జిల్లా: ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపణలు చేశారు. ప్రజల ఆదరాభిమానాలు ఉంటేనే రాజకీయాల్లో గెలుపు సాధ్యమవుతుందని తెలిపారు. ఆదర్శ రాజకీయాలు చేసే నాయకుల్లో ధూళిపాళ్ల ముందుంటారని తెలిపారు. కోవిడ్ సమస్యలను అధిగమించి డీవీసీ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు.


ఆరేళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో డీవీసీ హాస్పిటల్ ముందుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మానసిక సమస్యలు ఉన్నవారు సమాజానికి ప్రమాదకరమని అన్నారు. ప్రతి వ్యక్తి ప్రాణాలు కాపాడేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడటానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఐదేళ్లలో ఖచ్చితమైన అభివృద్ధి మార్క్‌ను చూపిస్తామని అన్నారు.


జగన్‌ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: జీవీ ఆంజనేయులు

పల్నాడు జిల్లా: పల్లెలకు మేలు చేస్తుంటే జగన్‌ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయేలా గ్రామసభలు జరిగాయని తెలిపారు. పంచాయతీలకు కొద్దిరోజుల ముందే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారని అన్నారు. రూ.4,500 కోట్ల ఉపాధిహామీ పనులకు ఒకేసారి ఆమోదం తెలపడం చారిత్రాత్మకమని అన్నారు. త్వరలో రూ.1,100 కోట్లు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలిపారు.


ప్రజలకు మేలు జరుగుతున్నా జగన్ సొంత మీడియాలో పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పల్లెలకు నిధులు, అభివృద్ధి పనుల పండగ వస్తే సంతోషించాల్సిందిపోయి నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల నిధులు రూ.13వేల కోట్లు ఏం చేశారో జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో పంచాయతీలకు ఏం చేశారో చెప్పాలని జీవీ ఆంజనేయులు వెల్లడించారు.

Updated Date - Aug 24 , 2024 | 02:12 PM