Share News

Sajjala Ramakrishna: అంగన్వాడీ కార్మికులు తెగే దాకా లాగొద్దు.. తర్వాత తీవ్ర చర్యలుంటాయి

ABN , Publish Date - Jan 08 , 2024 | 08:54 PM

ఏపీలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పెర్‌లు సమ్మెలోకి దిగారని.. వారు తెగే దాకా లాగొద్దు.. తర్వాత తీవ్ర చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) హెచ్చరించారు.

Sajjala Ramakrishna: అంగన్వాడీ కార్మికులు తెగే దాకా లాగొద్దు.. తర్వాత తీవ్ర చర్యలుంటాయి

తాడేపల్లి: ఏపీలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పెర్‌లు సమ్మెలోకి దిగారని.. వారు తెగే దాకా లాగొద్దు.. తర్వాత తీవ్ర చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) హెచ్చరించారు. సోమవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంగన్వాడీ కార్మికులతో మొదట్లో అధికారులు, తర్వాత మంత్రుల బృందం చర్చలు జరిపారని చెప్పారు. మొన్న వీరిపై ఎస్మా ప్రయోగిస్తూ జీఓ తెచ్చామని వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు కొన్ని ఆడియో మెసేజ్‌లు వారి గ్రూప్‌లల్లో పోస్ట్ చేశారని.. వారి మాటల్లో రాజకీయ పరమైన అజెండా ఉందని తెలిసిందని చెప్పారు. అంగన్‌వాడీ కార్మికులం లక్ష మంది ఉన్నామని.. తాము అనుకున్నది జరగకపోతే ప్రభుత్వాన్ని దించేస్తాం అనేలా వీడియోల్లో వారి మాటల్లో వ్యక్తం అవుతోందన్నారు. ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పాయని.. కానిది వచ్చే గవర్నమెంట్‌లో ఆలోచిస్తామని చెప్పామని తెలిపారు.తాము ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నామన్నారు. ఈ అంగన్వాడీల కింద లక్షలాది మంది మహిళలు, పిల్లలు, గర్భిణులు ఉన్నారన్నారు. ఎక్కడో ఒక పాయింట్ వద్ద ప్రభుత్వం ప్రత్యామ్నాయం చేయాల్సి ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

అంగన్వాడీల వెనుక జాతీయ పార్టీలు, లాయర్లు

అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగంగా చూస్తున్నామని చెప్పారు. ఈరోజు మేసేజ్‌లు చూస్తుంటే వీరి వెనుక జాతీయ పార్టీలు, లాయర్లు ఉన్నారని వీడియోలో తేలిందన్నారు. వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని.. వారు రాజకీయ అజెండాకు బలికావద్దని కోరుతున్నామన్నారు. పేద కుటుంబాలకు డిస్టర్బ్ చేయడం సరికాదన్నారు. జీతం పెంపు సాధ్యం కాదని అప్పుడు, ఇప్పుడు చెబుతున్నామని తేల్చిచెప్పారు. ఉద్యమం కొనసాగితే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుందన్నారు. డెడ్ లైన్ దాటినా ఎవ్వరిపైనా దురుసుగా ముందుకు వెళ్లవద్దని పోలీస్‌లకు చెప్పామన్నారు. ఎసెన్షియల్ సర్వీస్ కాదని అంగన్వాడీలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్లు ఎస్మా కిందకీ రారా.. వారే చెప్పాలని నిలదీశారు. మున్సిపల్ వర్కర్లతో చర్చలు జరుగుతున్నాయన్నారు. అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కారమవుతామని భావిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా ఉంటుంది.. ఆ చర్యలు ఎవరిపైనా తీసుకున్నప్పుడు తెలుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

Updated Date - Jan 08 , 2024 | 08:54 PM