Share News

Chandrababu: చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం

ABN , Publish Date - Feb 18 , 2024 | 04:10 PM

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) నివాసంలో రాజశ్యామల యాగం మూడురోజులుగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు(ఆదివారం) ఈ యాగం ముగిసింది. శుక్రవారం నుంచి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది.

Chandrababu: చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) నివాసంలో రాజశ్యామల యాగం మూడురోజులుగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు(ఆదివారం) ఈ యాగం ముగిసింది. శుక్రవారం నుంచి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేదపండింతులు పి.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజాక్రతువులు నిర్వహించారు.

మూడో రోజు ఆదివారం మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యాగం ముగిసింది. యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. కాగా రాజ శ్యామల యాగం ముగించుకొని చంద్రబాబు దంపతులు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో కాసేపటి క్రితమే హైదరాబాద్ బయలుదేరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2024 | 08:31 PM