AP Politics: టికెట్లు అడిగిన జనసేన నేతలపై పవన్ సీరియస్.. ఇదీ అసలు కథ!
ABN , First Publish Date - 2024-02-06T17:11:28+05:30 IST
జనసేన(Janasena) పేరిట చెక్‌లు ఇచ్చి, ఆ తర్వాత సీటు అడుగుతున్న నేతలపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సీరియస్ అయ్యారు. అలాగే పార్టీకి డొనేషన్ ఇస్తున్నామని చెక్‌లను కొంతమంది ప్రముఖులు ఇచ్చి సీటు అడిగారు దీనిపై కూడా పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: జనసేన(Janasena) పేరిట చెక్‌లు ఇచ్చి, ఆ తర్వాత సీటు అడుగుతున్న నేతలపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సీరియస్ అయ్యారు. ఇటీవల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వారిలో కొందరు.. పార్టీకి డొనేషన్ ఇస్తున్నామని చెక్‌లు ఇచ్చారు. దీన్నే సాకుగా చూపిస్తూ తాము ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని సీట్లు అడిగారు. దీంతో సీట్లు అడిగిన ప్రముఖులపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలు, సిబ్బందితో పవన్ మాట్లాడి.. సీట్లు అడిగిన ప్రముఖుల చెక్‌లను వెంటనే వెనక్కి పంపాలని ఆదేశించారు.
ఎందుకివ్వాలి..?
పవన్ ఆదేశాలతో ముఖ్యనేతలు రంగంలోకి దిగి.. చెక్‌లు ఇచ్చిన ప్రముఖులకు ఫోన్‌లు చేసి వెనక్కి తీసుకెళ్లాలని ఫోన్లు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఏడుగురికి చెక్‌లను పవన్ వెనక్కి పంపించినట్లు సమాచారం. ఆయన నిర్ణయంతో సీట్లు ఆశించి చెక్‌లు ఇచ్చిన ప్రముఖులు కూడా ఖంగు తిన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడి పని చేసిన నేతలను వదిలి కొత్తవారికి ఎలా అవకాశం ఇస్తారని పవన్ చెక్‌లు ఇచ్చిన వారిని ప్రశ్నించినట్లు సమాచారం.