Share News

Republic Day: జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్

ABN , Publish Date - Jan 26 , 2024 | 09:57 AM

గుంటూరు జిల్లా: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి.

Republic Day: జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్

గుంటూరు జిల్లా: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేనాని పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతీయ గీతాలాపన చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2024 | 09:57 AM