Share News

Nagul Meera: టీడీపీ - జనసేన తొలి జాబితాతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి

ABN , Publish Date - Feb 25 , 2024 | 08:51 PM

తెలుగుదేశం – జనసేన కూటమి అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని టీడీపీ రాష్ట్ర నేత నాగుల్ మీరా(Nagul Meera) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ - జనసేన ఒకే దఫాలో 99 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. సీఎం జగన్ రెడ్డి 77 మందిని ప్రకటించేందుకు 7 లిస్టులు ఇవ్వాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.

Nagul Meera: టీడీపీ - జనసేన తొలి జాబితాతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి

అమరావతి: తెలుగుదేశం – జనసేన కూటమి అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని టీడీపీ రాష్ట్ర నేత నాగుల్ మీరా(Nagul Meera) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ - జనసేన ఒకే దఫాలో 99 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. సీఎం జగన్ రెడ్డి 77 మందిని ప్రకటించేందుకు 7 లిస్టులు ఇవ్వాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత ధూషణలు చేస్తున్న వైసీపీ కాపు నేతలు జగన్ రెడ్డి కాపు ద్రోహాన్ని ఎందుకు ప్రశ్నించరు ? అని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబుకు సీటు ఉందా? అని నిలదీశారు.

కాపులపై దొంగ ప్రేమ వలకబోస్తున్న అంబటి రాంబాబుకు కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాపులకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానన్న జగన్ రెడ్డి కనీసం వారికి రూ. వంద కోట్లు కూడా ఇవ్వకపోతే వైసీపీ కాపు నాయకులు ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. ఓసీ ప్రాతినిధ్యం వహించే విజయవాడ సెంట్రల్ స్థానాన్ని దళితుడైన బి.ఎస్ జయరాజుకు టీడీపీ అవకాశం కల్పించిందని.. అది సామాజిక న్యాయం పట్ల తమ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఐదు విభాగాలుగా విభజించి జగన్ రెడ్డి తన సొంత కులానికి చెందిన ఐదు సామంత రాజులను నియమించుకున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం తప్పదని నాగుల్ మీరా హెచ్చరించారు.

Updated Date - Feb 25 , 2024 | 08:51 PM