Alla Ramakrishna Reddy: మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే.. సడన్‌గా ఏమైందో..!?
ABN , Publish Date - Feb 20 , 2024 | 10:39 AM
గుంటూరు జిల్లా: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) మళ్లీ స్వంత గూటికి చేరనున్నారు. మంగళవారం ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ (CM Jagan)ను కలిసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.
గుంటూరు జిల్లా: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) మళ్లీ వైసీపీలో చేరనున్నారు. మంగళవారం నాడు.. ఆళ్ల సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ (CM Jagan)ను కలిసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది. గత రాత్రి ఆర్కేతో ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సుదీర్ఘ మంతనాలు జరిపారు. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ను ఓడించడమే లక్ష్యంగా తాడేపల్లి పెద్దలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్కే మళ్లీ పార్టీలోకి వస్తే మంగళగిరిలో వైసీపీ మరింత బలంగా మారుతుందని పెద్దలు భావిస్తున్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్‌పై విజయం సాధించారు. అయితే రెండో సారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం జగన్ చోటు కల్పించకపోవడంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉన్నారు. తర్వాత గంజి చిరంజీవిని పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.