CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్..
ABN , Publish Date - Jul 15 , 2024 | 09:32 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఆయన చంద్రబాబుతో చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు వివరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)ను JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్(Sajjan Jindal) మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఆయన చంద్రబాబుతో చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు వివరించారు. తగిన ప్రతిపాదనలతో రావాలని జిందాల్‌ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసిన ఫొటోను చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. జిందాల్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కలయిక ద్వారా రాష్ట్రంలో కొత్త అవకాశాలు సృష్టించి ప్రజలకు మంచి చేయెుచ్చని ఎక్స్‌లో చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే సీఎం చంద్రబాబు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(BPCL), వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ ఫాస్ట్(WIN FAST) సంస్థల ప్రతినిధులతో సచివాయలంలో ఈనెల 10వ తేదీన భేటీ అయ్యారు. వారితో పెట్టుబడులు పెట్టించడమే లక్ష్యంగా సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం అని, సంస్థలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వారికి చంద్రబాబు వివరించారు.
బీపీసీఎల్‌తో చర్చలు కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. 90రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు పూర్తి ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే విన్ ఫాస్ట్ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ, సంస్థ ప్రతినిధులతో సమావేశం అయిన సీఎం ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్లు రాష్ట్రంలో నెలకొల్పాలని ముఖ్యమంత్రి కోరారు. ప్లాంటుకు అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
MLA Janardhana Rao: కౌంటింగ్ రోజు పారిపోయి ఇవాళ నీతులు చెప్తున్నావా?..
Krishna water: కృష్ణా జలాలపై విచారణ ఆగస్టు 28, 29తేదీలకి వాయిదా..