Share News

Big Breaking: జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో బిగ్ షాక్..

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:57 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(AP High Court) రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం, రాష్ట్రం నిధులు(Govt Funds) జమ చేయకుండా చేసినట్లు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం జమచేయాల్సిన రూ.75 కోట్లు సొమ్ము ఎక్కడని రాష్ట్ర ప్రభుత్వాన్ని(Andhra Pradesh Govt) హైకోర్టు ప్రశ్నించింది.

Big Breaking: జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో బిగ్ షాక్..
AP High Court

అమరావతి, మార్చి 06: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(AP High Court) రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం, రాష్ట్రం నిధులు(Govt Funds) జమ చేయకుండా చేసినట్లు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం జమచేయాల్సిన రూ.75 కోట్లు సొమ్ము ఎక్కడని రాష్ట్ర ప్రభుత్వాన్ని(Andhra Pradesh Govt) హైకోర్టు ప్రశ్నించింది. గన్నవరంలో(Gannavaram) నూతన కోర్టు భవన నిర్మాణాన్ని చేపట్టాలని, పాత భవనానికి మరమ్మత్తులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని గన్నవరానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖరరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. విచారణ సమయంలో ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టింది. రూ. 30 కోట్లు నిధులు జమ‌ చేయకుండా చేసినట్లు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్.. హైకోర్టు బిల్లులు అప్‌లోడ్ చేస్తే సొమ్ము వెంటనే జమ అవుతుందని వివరించారు. అయితే, గత విచారణ సందర్భంగా సొమ్మును జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. ఆ విషయాన్ని ప్రస్తావించిన ధర్మాసనం.. ప్రభుత్వం తీరును తప్పుపట్టింది.

ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం రూ. 45 కోట్ల నిధులు ఇచ్చిందని.. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది జూపూడీ యజ్ఞదత్ హైకోర్టుకు తెలియజేశారు. రూ. 45 కోట్లు మరో గంటలో ఖాతాలో జమ అవుతాయని ఏజీ తెలిపారు. 15 రోజుల్లో రాష్ట్ర వాటా రూ. 30 కోట్లు జమ‌ అవుతాయని వివరణ ఇచ్చారు. అయితే, దీనిపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేసేందుకు సమయం కోరడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వారం రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూ. 45 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రూ. 30 కోట్లు మొత్తం రూ. 74 కోట్లు తమ ఆధీనంలో ఉండేలా సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్‌కు జమ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2024 | 09:57 PM