Share News

TDP: నేడు టీడీపీ అభ్యర్థులకు బిఫామ్స్ ఇవ్వనున్న చంద్రబాబు..

ABN , Publish Date - Apr 21 , 2024 | 08:07 AM

అమరావతి: సార్వత్రికల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బిఫామ్స్ ఇవ్వనున్నారు.

TDP: నేడు టీడీపీ అభ్యర్థులకు  బిఫామ్స్ ఇవ్వనున్న  చంద్రబాబు..

అమరావతి: సార్వత్రికల ఎన్నికల (Elections) నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ (Assembly), పార్లమెంట్ (Parliament) అభ్యర్థులకు చంద్రబాబు బిఫామ్స్ (B forms)ఇవ్వనున్నారు. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు తన చేతుల మీదుగా బిఫామ్స్ ఇవ్వనున్నారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు సమావేశం అవుతారు. ప్రచారం, వ్యూహ ప్రతి వ్యూహాలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. మే 13న పోలింగ్ జరగ్గా.. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది.


కాగా ఇప్పటికే మంగళగిరిలోని జనసేన (Janasena) పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభ్యర్థులకు బిఫామ్స్ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థులు 21 అసెంబ్లీ స్థానాల్లో, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. సీట్ల సర్దుబాటులో జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలను, రెండు లోక్ సభ స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే.


జనసేన బీ ఫామ్స్ స్వీక‌రించిన అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

నెల్లిమర్ల: లోకం మాధవి; అనకాపల్లి: కొణతాల రామకృష్ణ; కాకినాడ రూరల్‌: పంతం నానాజీ; రాజానగరం: బత్తుల రామకృష్ణ; తెనాలి: నాదెండ్ల మనోహర్; నిడదవోలు: కందుల దుర్గేష్; పెందుర్తి: పంచకర్ల రమేష్ బాబు; యలమంచిలి సుందరపు విజయ్‌కుమార్‌; పి.గన్నవరం: గిడ్డి సత్యనారాయణ; రాజోలు: దేవ వరప్రసాద్; తాడేపల్లిగూడెం: బొలిశెట్టి శ్రీనివాస్; భీవరం: పులివర్తి ఆంజనేయులు; నరసాపురం: బొమ్మిడి నాయకర్; ఉంగటూరు: పత్సమట్ల ధర్మరాజు; పోలవరం: చిర్రి బాలరాజు; తిరుపతి: ఆరణి శ్రీనివాసులు; రైల్వే కోడూరు: శ్రీధర్‌; అవనిగడ్డ: మండలి బుద్దప్రసాద్ తదితరులు పోటీ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ గులకరాయి కేసు: వేముల దుర్గారావు అరెస్టు.. విడుదల..

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 08:18 AM