Share News

AP Politics: చంద్రబాబును కలిసిన బీకే పార్థసారధి.. కారణమిదే..?

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:15 PM

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ని ఉండవల్లిలోని నివాసంలో సోమవారం నాడు మాజీ ఎంపీ బీకే పార్థసారధి(B K Parthasarathi) కలిశారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని బీకేకు చంద్రబాబు సూచించారు.

AP Politics: చంద్రబాబును కలిసిన బీకే పార్థసారధి.. కారణమిదే..?

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ని ఉండవల్లిలోని నివాసంలో సోమవారం నాడు మాజీ ఎంపీ బీకే పార్థసారధి(B K Parthasarathi) కలిశారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని బీకేకు చంద్రబాబు సూచించారు.

గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో తాను చేసిన పనులను వివరించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వ్యక్తిని కాదని బీకే పార్థసారధి తెలిపారు. అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి బీకే పార్థసారధి కచ్చితంగా గెలుస్తారని సర్వే రిపోర్టులు తనకు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. అధినేత నిర్ణయమే తనకు శిరోధార్యామని బీకే పార్థసారధి అన్నారు. అలాగే చంద్రబాబును నిమ్మల కిష్టప్ప కూడా కలిశారు.. జిల్లాలో ఏదోక స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కిష్టప్ప చంద్రబాబును కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 03:16 PM