Share News

AP Politics: నాడు తండ్రి.. నేడు కొడుకు.. అంతా వారికే..!

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:24 AM

ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం గనులు సహా ఇతర సహజవనరులతో వ్యాపారం చేయాలనుకుంటే లాభాలు ఆశిస్తుంది.

AP Politics: నాడు తండ్రి.. నేడు కొడుకు.. అంతా వారికే..!
Andhra Pradesh Govt

  • బెనిఫిసియేషన్‌ పేరిట నాడు తండ్రి.. నేడు కొడుకు

  • బెరైటీస్‌, ఐరన్‌వోర్‌, బొగ్గులో ప్రైవేటు సంస్థలకు పెద్దపీట

  • ఎండీసీని నిండా ముంచి ప్రైవేటుకు లాభాల సిరులు

  • జాయింట్‌ వెంచర్‌ పేరిట సింహభాగం ప్రైవేటుకు వాటా

  • ప్రజా ప్రయోజనం బుట్టదాఖలు

  • 11:89 వాటా వెనుక భారీ వ్యూహం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం గనులు సహా ఇతర సహజవనరులతో వ్యాపారం చేయాలనుకుంటే లాభాలు ఆశిస్తుంది. ప్రైవేటు కంపెనీలతో కలిసి కంపెనీలు పెట్టి వ్యాపారం చేయాలనుకుంటే తను లాభం పొందాలని భావిస్తుంది. ఇలా వచ్చిన సొమ్ము ను ప్రజా సంక్షేమంతోపాటు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేలా చేస్తుంది. అదే ప్రజాప్రభుత్వ లక్ష్యం. కానీ, అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయు డు, నేటి సీఎం జగన్‌ మాత్రం సర్కారు ఖజానాకు చిల్లుపెట్టి కార్పొరేట్‌, ప్రైవేటు మైనింగ్‌ కంపెనీల జేబు లు నింపారు. జాయింట్‌ వెంచర్‌, బెనిఫిసియేషన్‌ ప్లాం ట్‌ల ఏర్పాటు పేరిట కార్పొరేట్‌ గనులను ప్రైవేటుకు ఒక సంక్షేమ పథకంలా అమలు చేశారు. గనుల లీజులున్న ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)ని నిండా ముంచేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. బొగ్గు, ఐరన్‌వోర్‌తోపాటు ఇప్పుడు సర్కారు ఖజానాకు భారీ లాభాలు తీసుకొస్తున్న బెరైటీ్‌సలోనూ ప్రైవేటుకు రూ. వేల కోట్ల కనకవర్షం కురిపించేలా వాటాలు ఇచ్చారు. బొగ్గు, బెరైటీ్‌సలో జగన్‌ అచ్చం తన తండ్రి మాదిరిగా అదే పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఐరన్‌వోర్‌, బాక్సైట్‌, లాటరైట్‌, బెరైటీస్‌, క్వార్ట్జ్‌ వంటి ఖనిజాల లీజులు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీ పేరిట ఉన్నా యి. ఎండీసీకి ఏపీలోని ప్రకాశం జిల్లా కొణిజేడు-మర్లపాడుతోపాటు, మధ్యప్రదేశ్‌లోని సులెయారి, ఛత్తీ్‌సగఢ్‌ లో బొగ్గు గనుల లీజులున్నాయి. ఇక, రాష్ట్రంలో బాక్సైట్‌, లాటరైట్‌తోపాటు మంగంపేట బెరైటీస్‌, బీచ్‌శాండ్‌, క్వార్ట్జ్‌ గనుల లీజులున్నాయి. గనుల లీజులు ఎండీసీ పేరిట ఉన్నా సొంతంగా మైనింగ్‌ చేసే శక్తి లేదు కాబ ట్టి ప్రైవేటు కంపెనీలకు టెండర్లు ఇచ్చి మైనింగ్‌ చేయించవచ్చు. 2007కు ముందు ఇదే జరిగేది. అయితే, ఉమ్మడి ఏపీలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు లీజుల కాంట్రాక్టు స్థానంలో ‘బెనిఫిసియేషన్‌’ అనే కొత్త విధానం తీసుకొచ్చారు. అంటే, ఒక ప్రెవేటు కంపెనీతో జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటుచేసి, దానికే మైనింగ్‌, బెనిఫిసియేషన్‌ ప్లాంటు ఏర్పాటు, అమ్మకం వంటి బాధ్యతలు అప్పగిస్తారు. వైఎస్‌ తీసుకున్న నిర్ణయం మేరకు బెనిఫిసియేషన్‌లో ఎండీసీకి కేవలం 11శాతం వాటా చాలని నిర్దేశించారు. జింపెక్స్‌ కంపెనీకి 89శాతం ఇస్తూ 2008లో ఒప్పందం కుదుర్చుకున్నారు.

బెనిఫిసియేషన్‌ మహామోసం

సర్కార్‌ ఒప్పందాన్ని పరిశీలిస్తే ప్రైవేటు ‘లోగుట్టు’ కనిపిస్తుంది. ఎండీసీకి 11 శాతం వాటా. జింపెక్స్‌కు 89 శాతం వాటా. దీని ప్రకారం 100 టన్నుల బెరైటీ్‌స ను బెనిఫిసియేషన్‌ చేస్తే అందులో 30 శాతమే నాణ్యమైన సరుకు బయటకు వస్తుంది. మిగిలిన 70 శాతం వృఽథా కింద పోయినట్లుగా పరిగణిస్తారు. ఇక, 30 శాతం నాణ్యమైన సరుకును అమ్మగా వచ్చిన దాంట్లో 11 శాతం ఎండీసీకి ఇస్తారు. మిగిలినది ప్రైవేటుకు వెళ్లేలా ఒప్పందం చేసుకున్నారు. ‘ఇది పెద్ద మోసం’ అని గనుల శాఖ నిపుణులు చెబుతున్నారు. నిజానికి సీ-గ్రేడ్‌ బెరైటీస్‌ టన్ను ధర రూ.2,100 ఉంటుంది. దాన్ని నేరుగా ప్రైవేటు కొనుగోలుదారుకు ఇస్తే ఆ మొ త్తం సొమ్ము ఎండీసీకి వస్తుంది. దీనివల్ల ఎండీసీకి లాభాలు వస్తాయి. కానీ, ప్రైవేటుకే లాభం రావాలనుకొని, బెరైటీ్‌సను నేరుగా అమ్మకుండా ప్రైవేటుతో బెనిఫిసియేషన్‌ అనే తతంగానికి తెరదీశారు. అంటే, టన్ను బెరైటీ్‌సను బెనిఫిసియేషన్‌ చేస్తే దానిలో 30శాతమే పనికొస్తుంది కాబట్టి అందులోనే ఎండీసీకి వాటా ఇస్తారు. మరి వృథాగా పోయిన 70 శాతం బెరైటీ్‌సను ఎంచేస్తారు? ఇదే అసలు ట్విస్ట్‌. దాన్ని ప్రైవేటు కంపెనీ అమ్ముకోవచ్చు. దానిపై వచ్చే సొమ్ములో రూ పాయి కూడా ఎండీసీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బెనిఫిసియేషన్‌ అసలు లక్ష్యం అదే. నిజానికి బెనిఫిసియేషన్‌తో సంబంధం లేకుండా గ్రేడ్‌ల వారీగా బెరైటీ్‌స ను ఎండీసీనే కొనుగోలుదారులకు అమ్మితే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి కొనుగోలు చేస్తారు. ధరను కూడా ఎండీసీ శాసించే అవకాశం ఉంటుంది. ఇంతగా లాభాలు పొందే అవకాశం ఉన్నా సర్కారు వదులుకొని బెనిఫిసియేషన్‌ పేరిట ప్రైవేటు బాట పట్టారు. మొత్తం సరఫరా చేసిన బెరైటీ్‌సలో 11 శాతం వాటా ఎండీసీకి దక్కదు. కేవలం అప్‌గ్రేడ్‌ అయిన బెరైటీ్‌సలోనే 11 శాతం వాటా వస్తుంది. అలా అప్‌గ్రేడ్‌ అయ్యే బెరైటీస్‌ అంతా కలిపితే తక్కువ మొత్తంలోనే ఉంటుం ది. ఇక, వృథా పేరిట పడేసే బెరైటీస్‌ను అమ్ముకుంటే ప్రైవేటుకు వచ్చే లాభం భారీగా ఉంటుంది. నేరుగా ఎండీసీకే లాభాలు వచ్చేలా బెరైటీ్‌సను అమ్ముకుని వేలకోట్ల లాభం పొందే అవకాశం ఉన్నా దాన్ని దెబ్బతీసి బెనిఫిసియేషన్‌ వెంటపడటంలోని అసలు ఆంత ర్యం ఇదే. ఈ ప్లాంటును ఏర్పాటు చేసే జింపెక్స్‌కు కారు చౌకగా 100 ఎకరాలు ఇచ్చారు. ప్లాంటు ఏర్పాటుకు 2008లో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు 2024. ఇంత వరకు అతీగతీలేదు. అయినా ఆ ఒప్పందాన్ని గనుల శాఖ రద్దుచేయలేదు. తండ్రి హయంలో జరిగిన ఒప్పందాన్ని కొడుకు జగన్‌ కొనసాగిస్తున్నారు.

అదే దారి

ఎండీసీకి ప్రకాశం జిల్లా కొణిజేడు-మర్లపాడు బ్లాక్‌లో 1,300 ఎకరాల్లో బొగ్గు నిక్షేపాలున్నాయి. అక్కడ మైనింగ్‌, బెనిఫిసియేషన్‌ ప్లాంటుకోసం ఇటీవల టెండర్లు పిలిచారు. సేమ్‌ టు సేమ్‌. తండ్రిబాటలోనే తనయుడు. లీజులున్న ఎండీసీకి 11 శాతం వాటా ఇస్తే, టెండర్‌ దక్కించుకునే ప్రైవేటు సంస్థకు 89 శాతం వాటా అని నిర్దేశించారు. ఇక్కడి బొగ్గులో అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుంది. బెనిఫిసియేషన్‌ ప్లాంటు ద్వారా బొగ్గును ప్రాసె్‌సచేసి అమ్మిపెట్టే బాధ్యత ప్రైవేటు సంస్థది. టెండర్‌ జిందాల్‌ సంస్థ దక్కించుకుంది. నేరుగా బొగ్గును తవ్వితీసే కాంట్రాక్ట్‌ ప్రైవేటుకు ఇవ్వొచ్చు. ఆ తర్వాత ఆ ముడిబొగ్గును ప్రైవేటు కొనుగోలుదారులకు అమ్మవచ్చు. దీనివల్ల ఎండీసీకి లాభాలు వస్తాయి. అందుకు భిన్నంగా బొగ్గు తవ్వడంతోపాటు, ప్రాసె్‌సచేసి, అమ్మిపెట్టే బాధ్యతను కూడా జిందాల్‌కే ఇచ్చారు.

ఏమిటీ.. బెనిఫిసియేషన్‌?

బెనిఫిసియేషన్‌ అంటే.. తవ్వితీసిన ఖనిజాన్ని ప్రాసె్‌సచేసి మరింత నాణ్యమైన ఖనిజంగా మార్చే ప్రక్రియ. తొలుత బెరైటీ్‌సలోనే ఈ విధా నం తీసుకొచ్చారు. ఎంఎండీఆర్‌ చట్టం-1956 ప్రకారం ఎండీసీ ప్రైవేటుతో జాయింట్‌ వెంచర్‌కు వెళ్లాలనుకుంటే, అందులో ఎండీసీకి కనీసం 75 శాతం వాటా ఉండాలి. కానీ, నాటి వైఎస్‌ ప్రభుత్వం ఈ నిబంధనను పక్కనపెట్టింది.

వృథా కూడా ప్రైవేటు పాలే!

100 టన్నుల ముడిబొగ్గును అప్‌గ్రేడ్‌ చేస్తే 30 శాతం అంటే 30 టన్నుల మేర నాణ్యమైన సరుకు వస్తుంది. అలా వచ్చిన దానిపై 11 శాతం ఎండీసీకి వాటా కింద ఇస్తారు. మిగిలిన 89 శాతం జిందాల్‌ తీసుకుంటుంది. మరి, వృథా కింద లెక్కచూపే 70 టన్నుల బొగ్గును ఏం చేస్తారు? అంటే.. ప్రైవేటు సంస్థే అమ్ముకుంటుంది. దాన్ని కొనుగోలుచేసే బయ్యర్లు కూడా ఉంటారు. బెనిఫిసియేషన్‌ అంటేనే కంటికి కనిపించిన ప్రైవేటు మేళ్లు దాగి ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 10:09 AM