Share News

AP News: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడికి ఊరట

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:34 PM

GST కేసులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టులో ఊరట లభించింది. శరత్‌ను అతనిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన కస్టడీ పిటీషన్‌ను విజయవాడ కోర్టు డిస్మిస్ చేసింది. శరత్ బెయిల్ పిటిషన్‌పై రేపు కౌంటర్ దాఖలు చేయాలంటూ న్యాయమూర్తి... పోలీసులను ఆదేశించారు

AP News: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడికి ఊరట

విజయవాడ: GST కేసులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టులో ఊరట లభించింది. శరత్‌ను అతనిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన కస్టడీ పిటీషన్‌ను విజయవాడ కోర్టు డిస్మిస్ చేసింది. శరత్ బెయిల్ పిటిషన్‌పై రేపు కౌంటర్ దాఖలు చేయాలంటూ న్యాయమూర్తి... పోలీసులను ఆదేశించారు.

విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో శరత్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేశారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ అయ్యింది. ఎఫ్‌ఐఆర్‌లో పుల్లారావు భార్య, బావమరిదితో పాటూ మరో ఐదుగురుపై కేసు నమోదైంది. అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 09:34 PM