Share News

AP Elections 2024: యథేచ్చగా వైసీపీ ప్రచారం.. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా డోంట్ కేర్..

ABN , Publish Date - Mar 17 , 2024 | 02:46 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. కోడ్ కారణంగా నేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

AP Elections 2024: యథేచ్చగా వైసీపీ ప్రచారం.. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా డోంట్ కేర్..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. కోడ్ కారణంగా నేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే అధికార వైసీపీ ( YCP ) మాత్రం కించిత్ కూడా భయం లేకుండా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫైబర్ నెట్ లో యథేచ్ఛగా వైసీపీ ప్రచారం చేస్తోంది. నిన్న ( శనివారం ) మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. సిద్ధం సభలో సీఎం మాట్లాడిన ఉపన్యాసంతో వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఎలాంటి విరామం లేకుండా ఏపీ ఎస్ఎఫ్ఎల్ లోగోతో టీవీ పెట్టగానే జగన్ సిద్ధం సభ స్పీచ్ వస్తోందని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రచార పిచ్చిని భరించలేకపోతున్నామని, ప్రభుత్వమే ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

కాగా.. ఎలక్షన్ కోడ్ ప్రకారం రాజకీయ పార్టీలు, నాయకులు పనితీరు ఆధారంగానే విమర్శలు చేయాలి గానీ.. కులం, మతం, జాతి ఆధారంగా కాదు. ఓటర్లను ఆకట్టుకోవడానికి డబ్బులు ఇవ్వకూడదు. ప్రజలకు ఆర్థిక గ్రాంట్లు ప్రకటించకూడదు. ఎంపీ గానీ, మంత్రి గానీ అధికారిక పర్యటనను, పార్టీ పర్యటనను వేర్వేరుగా ఉండేలానే చూసుకోవాలి. అధికారంలో ఉన్నవారు అవతలి వారికి ప్రచారం చేసుకునే కనీస అవకాశం కూడా కల్పించకుండా ఉండకూడదు. కోడ్ ను ఉల్లంఘిస్తే దర్యాప్తు చేసి శిక్ష విధించేందుకు ఎన్నికల కమిషన్‌కు పూర్తి అధికారం ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2024 | 03:11 PM