Share News

AP Politics: ‘నేను వైఎస్‌కి పుట్టలేదట’ వైఎస్ అవినాష్‌పై షర్మిల విసుర్లు

ABN , Publish Date - Apr 06 , 2024 | 07:14 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు. కడప లోక్ సభలో ప్రత్యర్థి అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసిన వారితో సంబంధాలు ఎందుకు ఉన్నాయని సూటిగా నిలదీశారు. హత్య జరిగిన సమయంలో చేసిన కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయని ప్రశ్నించారు.

AP Politics: ‘నేను వైఎస్‌కి పుట్టలేదట’ వైఎస్ అవినాష్‌పై షర్మిల విసుర్లు
YS Sharmila Slams YS Avinash Reddy

కడప జిల్లా: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) బిజీగా ఉన్నారు. కడప లోక్ సభలో ప్రత్యర్థి అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసిన వారితో సంబంధాలు ఎందుకు ఉన్నాయని సూటిగా అడిగారు. హత్య జరిగిన సమయంలో చేసిన కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రమేయం లేకుంటే.. సీబీఐ విచారణ అంటే ఎందుకు జంకారని అడిగారు. తనను వ్యక్తిగతంగా దూషించారని షర్మిల (YS Sharmila) వాపోయారు. తాను వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి జన్మించలేదట..? తన సోదరి సునీతా రెడ్డి వివేకానందను హత్య చేయించిందని నిందలు మోపారు. మీరు చెబుతోన్న అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారని షర్మిల గుర్తుచేశారు హంతకులను చట్టసభలకు పంపించొద్దని, అందుకోసమే తాను కడప లోక్ సభ నుంచి బరిలోకి దిగానని వెల్లడించారు.


భుజాలు తడుముకున్నారు

‘చిన్నాన్న వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తాము బురద జల్లుతున్నం అంటున్నారు. మా విజ్ఞతకు వదిలేస్తాడానని చెబుతున్నారు. దొంగలు ఎవరు అంటే భుజాలు తరుముకున్నట్టు ఉంది అవినాష్ రెడ్డి తీరు. కేసుతో సంబంధం లేదని చెప్పొచ్చు కదా..? గూగుల్ మ్యాప్స్‌కి మీకు సంబంధం లేదని చెప్పొచ్చు కదా..? మీ కాల్ రికార్డ్స్ హంతకుల ఫోన్ రికార్డ్స్‌తో ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి..? హంతకులకు మీకు సంబంధాలు ఎందుకు ఉన్నాయి..? వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పండి..? సీబీఐ విచారణ అంటే ఎందుకు భయపడ్డారు..? ఇళ్లంతా రక్తం ఉంటే హార్ట్ ఎటాక్‌తో చనిపోయారని ఎందుకు అబద్దం ఆడారు..? త్యాగ మూర్తి మాదిరిగా మీ మాటలు చూస్తుంటే దొంగలు దొంగలు భుజాలు తరుముకున్నట్టు ఉంది అని’ షర్మిల మండిపడ్డారు.


పోటీకి దూరంగా ఉన్నా

‘ఒక రోజు ఇదే అవినాష్ రెడ్డి కోసం ఎంపీ సీటు వదిలేశా. ఆ రోజు తాను అనుకుంటే ఎంపీగా పోటీ చేసేదాన్ని. జగన్ కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఏ రోజు పదవి కావాలని అడగలేదు. ఇప్పుడు ఎవో మాట్లాడుతున్నారు. తననే కాదు సునీతను అవమానిస్తున్నారు. నేను వైఎస్ షర్మిలా రెడ్డిని కాదట. వైఎస్‌కు పుట్టలేదట. ఎన్ని అన్న పడ్డా. నిందలు మోపినా భరించా. అహంకారంతో అంటున్నారు. వైఎస్ వివేకా నాకు చిన్నాన్న, నన్ను ఎత్తుకొని పెంచారు. ఆ నాడు ముందుచూపుతో నన్ను కడప ఎంపీగా పోటీ చేయాలని అడిగాడు. ఒప్పించే ప్రయత్నం చేశాడు. అప్పుడు నాకు అర్ధం కాలేదు. వివేకా మాట విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కాదు అని’ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఐదేళ్లు అయినా జరగని న్యాయం

‘వివేకా హత్య జరిగి ఐదేళ్లు దాటింది. హంతకులకు శిక్ష పడలేదు. చివరికి వివేకా బిడ్డ చంపింది అని ముద్ర వేశారు. న్యాయం కోసం సునీత ఎక్కని గడప లేదు. తిరగని కోర్టులు లేవు. పెద్ద మనిషి హత్య జరిగితే ఇంతవరకు న్యాయం జరగలేదు. కేసును సీఎం జగన్ పట్టించుకోవడం లేదు. జగన్ హంతకులను కాపాడుతున్నాడు. ఐదేళ్లు హంతకులను కాపాడారు. మళ్ళీ వారికే టికెట్ ఇచ్చారు. ఇది అన్యాయం, అధర్మం.. హత్య చేసిన వారికి టికెట్ ఇవ్వడంతో తాను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగా అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

TG Politics: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 07:50 PM