Share News

AP Election 2024: వివేకా హత్యకు అలా ప్లాన్ చేశారు.. షర్మిల సంచలన ఆరోపణలు

ABN , Publish Date - May 01 , 2024 | 05:31 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. బద్వేల్ నియోజక వర్గం, పోరు మామిళ్ల మండలాల్లో బుధవారం షర్మిల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పుట్టింది ఇక్కడేనని.. ఇది నా గడ్డ అని తెలిపారు.ఇక్కడే ఉంట..ప్రజలకు సేవ చేస్తానని మాటిచ్చారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతానని స్పష్టం చేశారు.

AP Election 2024: వివేకా హత్యకు అలా ప్లాన్ చేశారు.. షర్మిల సంచలన ఆరోపణలు
YS Sharmila

కడప జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. బద్వేల్ నియోజక వర్గం, పోరు మామిళ్ల మండలాల్లో బుధవారం షర్మిల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పుట్టింది ఇక్కడేనని.. ఇది నా గడ్డ అని తెలిపారు.ఇక్కడే ఉంట..ప్రజలకు సేవ చేస్తానని మాటిచ్చారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతానని స్పష్టం చేశారు.ప్రత్యేక హోదాను సాధించుకొని వస్తానని హామీ ఇచ్చారు. జగన్ (CM Jagan) వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.


Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..

ఆయన ఆశయాలను ఒక్కటి కూడా జగన్ అమలు చేశారా అని నిలదీశారు. వైఎస్సార్ కొడుకునని చెప్పుకునే ఆయన.. అధికారంలో ఉండి రైతులను అప్పుల పాల్జేశారని విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో కడప ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గతంలో కడప ఎంపీగా వైఎస్సార్ కూడా పని చేశారని గుర్తుచేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా సైతం ఎంపీగా గెలిచారని తెలిపారు. ఇప్పుడు వైఎస్సార్ బిడ్డ(షర్మిల) కూడా కడప ఎంపీగా పోటీ చేస్తుందని ఉద్ఘాటించారు. వైఎస్ వివేకాను హత్య చేయించిన వ్యక్తి ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి అని ఆరోపించారు.


AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..

ఈ హత్య జరిగినప్పుడు తమకు కూడా ఈ విషయం తెలియదని చెప్పుకొచ్చారు. సీబీఐ(CBI)ఆధారాలు చూపించిన తర్వాత తాము నమ్మాల్సి వచ్చిందన్నారు. అన్ని ఆధారాలు అవినాష్ రెడ్డి హత్య చేశారని చెబుతున్నాయన్నారు. రూ. 40కోట్ల డీల్‌కు మాట్లాడి వివేకా హత్యకు ప్లాన్ చేశారని విమర్శించారు. మొబైల్ రికార్డ్స్, గూగుల్ లోకేషన్లు అన్ని అవినాష్ వైపు చూపించాయన్నారు.

అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ ఎలా కాపాడుతున్నారని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కర్ఫ్యూ సృష్టించారని ధ్వజమెత్తారు. సీబీఐకి సహకరించకుండా, అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా జగన్ చూశారని దుయ్యబట్టారు. ఇది అన్యాయం, అధర్మమన్నారు. తాను వైఎస్సార్ బిడ్డ.. పులి బిడ్డనని ఉద్ఘాటించారు. తన గుండెలో దమ్ముందని.. న్యాయం కోసమే ఎంపీగా పోటీ చేస్తున్నానని అన్నారు.


మళ్లీ నిందితుడు(అవినాష్)కి ఎంపీ సీట్ ఇవ్వడం అన్యాయమన్నారు. అన్యాయాన్ని ఎదురించడానికే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. మీరు న్యాయం వైపు ఉంటారా ? అన్యాయం వైపు ఉంటారా ? ఆలోచించుకోవాలని అన్నారు. నేడు రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎక్కడ లేడన్నారు. పంట నష్టపరిహారం, ధరల స్థిరీకరణ నిధి, నిరుద్యోగ బిడ్డలను దారుణంగా మోసం చేశారని విరుచుకుపడ్డారు.2.35లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారని.. మరీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అధికారం అనుభవించి ఒక్క ఉద్యోగం కూడా జగన్ భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. ఇవ్వాళ్టికి రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు.

Lok Sabha Polls 2024: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 06:19 PM