Share News

AP Politics: అనపర్తిపై వీడిన చిక్కుముడి.. బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి..

ABN , Publish Date - Apr 21 , 2024 | 11:40 AM

Andhra Pradesh Assembly Elections: అనపర్తి(Anaparthi) ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(Nallamilli Ramakrishna Reddy) బీజేపీ(BJP) నుంచి పోటీ చేసేందుకు అంగీకారం తెలిపారు. తొలుత తాను టీడీపీ(TDP) నుంచి మాత్రమే పోటీ చేస్తానని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి..

AP Politics: అనపర్తిపై వీడిన చిక్కుముడి.. బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి..
Nallamilli Ramakrishna Reddy

Andhra Pradesh Assembly Elections: అనపర్తి(Anaparthi) ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(Nallamilli Ramakrishna Reddy) బీజేపీ(BJP) నుంచి పోటీ చేసేందుకు అంగీకారం తెలిపారు. తొలుత తాను టీడీపీ(TDP) నుంచి మాత్రమే పోటీ చేస్తానని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పట్టుపట్టారు. అయితే, పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు వస్తుండటంతో.. నల్లమిల్లిని బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. అయితే, నల్లమిల్లి అందుకు అంగీకరించలేదు. దాంతో రంగంలోకి దిగిన చంద్రబాబు.. నేరుగా రామకృష్ణారెడ్డితో మాట్లాడారు.

ఇదికూడా చదవండి: బీజేపీలో పెద్దపల్లి పంచాయితీ.. అభ్యర్థి మార్పు కన్ఫామా?


ఆ వెంటనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నల్లమిల్లి ఇంటికి పంపారు టీడీపీ అధినేత. మరోవైపు బుచ్చయ్యతో నారా లోకేష్ కూడా మాట్లాడారు. దీంతో బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు కలిసి రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడారు. బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇలా చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ నేతలు మాట్లాడటంతో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించారు. నల్లమిల్లి ఇవాళో, రేపో బీజేపీలో చేరనున్నారు. అనంతరం బీజేపీ బీఫామ్ తీసుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఇదికూడా చదవండి: 65 సిక్స్‌లు, 53 ఫోర్లు.. చివరి ఓవర్‌లో ధోనీ విధ్వంసం..


బీఫామ్స్ ఇవ్వనున్న టీడీపీ అధినేత..

ఇదిలాఉంటే.. ఆదివారం నాడు చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫామ్స్ ఇవ్వనున్నారు. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులకు తన చేతుల మీదుగా బీఫామ్స్ ఇవ్వనున్నారు టీడీపీ అధినేత. బీఫామ్స్ పంపిణీ అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రచార వ్యూహ ప్రతి వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 21 , 2024 | 12:31 PM