PM Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ భేటీ
ABN , Publish Date - Mar 17 , 2024 | 08:45 PM
చిలకలూరి పేటలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
అమరావతి: చిలకలూరి పేటలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సభ బాగా జరిగిందని ప్రజల్లో చాలా ఉత్సాహం ఉందని ఈ సందర్భంగా బాబు, పవన్‌తో మోదీ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్టు ఘటనపైనా, ఆయన ఆరోగ్యం గురించి మోదీ మాట్లాడినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను చంద్రబాబు, పవన్ కళ్యాన్ ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసంపై పలు అంశాలను ఉదహరిస్తూ ఇద్దరు నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కాగా ప్రజాగళం సభలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై మోదీ, చంద్రబాబు, పవన్ విమర్శలు గుప్పించారు. ఈ సారి ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.