Share News

AP Election 2024:వైసీపీకి భారీ షాక్.. కీలక నేతల దారి అటువైపే..

ABN , Publish Date - May 06 , 2024 | 10:40 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ (YSRCP)కి భారీ షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాపు, బలిజ, ఒంటరి సంఘాల నేతలు హాజరయ్యారు.జగన్‌కు వ్యతిరేకంగా, ఎన్డీఏకు మద్దతుగా పని చేయాలని తీర్మానం చేసుకున్నట్లు సమాచారం.

AP Election 2024:వైసీపీకి భారీ షాక్.. కీలక నేతల దారి అటువైపే..

విజయవాడ: ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీకి (YSRCP) భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి, కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ముఖ్య అనుచరులు విజయవాడలో ఈరోజు(సోమవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాపు, బలిజ, ఒంటరి సంఘాల నేతలు హాజరయ్యారు. జగన్‌కు వ్యతిరేకంగా, ఎన్డీఏకు మద్దతుగా పని చేయాలని తీర్మానం చేసుకున్నారు. ఈ మేరకు కాపు, బలిజ,ఒంటరి వర్గాల కన్వీనర్‌ వాసిరెడ్డి ఏసుదాస్ మీడియాతో మాట్లాడారు. తమ సంఘాల పెద్దలంతా సమావేశం పెట్టుకున్నామని తెలిపారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న కులాల పెద్దలు పాల్గొన్నారని చెప్పారు.


Pawan Kalyan: అమృత ఘడియల వైపు భారత్.. మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాము తీర్మానించామని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ‌కాపుల‌ కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు కాపులకు‌ వెన్నుదన్నుగా ఉంటే... సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కాపులను కాళ్ల దగ్గర చెప్పుల్లాగా జగన్ వాడుకున్నారని ఆరోపించారు. 1956 వరకు కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారు. తర్వాత ఓసీలుగా మార్చి కాపులను ఎదగకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. బ్రహ్మానందరెడ్డి హయాంలో తొలగించిన రిజర్వేషన్ నేటికీ అమలు చేయలేదన్నారు. వైఎస్సార్ కాపులకు రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారని అన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ హామీ కోసం కొంత వరకు పని చేశారని చెప్పుకొచ్చారు.


గత ఎన్నికల్లో జగన్ అసలు రిజర్వేషన్ ఇవ్వబోమని‌ చెప్పినా కాపులు ఓట్లు వేశారని అన్నారు. జగన్‌కు కనీస విశ్వాసం లేకుండా కాపులను అణగదొక్కారని మండిపడ్డారు. పేద కాపులను విదేశాలకు పంపిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కాపు భవనాలు కూడా చంద్రబాబు కట్టించారని తెలిపారు. జగన్ కాపులకు ఏం చేశారో‌ చెప్పగలరా అని ప్రశ్నించారు. అసలు కాపులను ఓటు అడిగే హక్కు జగన్‌కు ఉందా అని నిలదీశారు. టీడీపీ హయాంలోనే కాపులకు ఉపకారం జరిగిందన్నారు. రెడ్డి పాలకులే కాపులకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. పెనమలూరులో బోడే ప్రసాద్ తో పాటు, రాష్ట్రం మొత్తం కాపులు కూటమికే ఓటు‌వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు‌ చీలకుండా రాష్ట్రం మంచి కోసం నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు కలిశారని అన్నారు.


Nara Lokesh: విశ్వజిత్‌గా నరేంద్ర మోదీ

జగన్‌కు బుద్ధి చెప్పాలి: ఆరేటి ప్రకాష్

రాష్ట్రం, జాతి ప్రయోజనాల కోసం తాము పని చేస్తున్నామని కాపు సంఘాల కన్వీనర్‌ ఆరేటి ప్రకాష్ తెలిపారు. రాష్ట్ర కాపు జేఏసీ తరపున అనేక పోరాటాలు చేశామన్నారు. తుని ఘటనలో పాల్గొన్న తమకు వాస్తవ పరిస్థితి అర్ధం అయ్యిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాపులతో‌ పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఎవరికి ఎంత మేర న్యాయం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఒక్కసారి జగన్‌ని నమ్మి మోస పోయామని ఫైర్ అయ్యారు. మరోసారి అవకాశం ఇవ్వకుండా జగన్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.


జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే సోమాలియాగా ఏపీని మారుస్తారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా అవినీతే...‌కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. ప్రజలను ఉద్దరించినట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటువేయాలని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రానికి అవసరమన్నారు.కేంద్రం, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక ప్రగతి పెరుగుతుందని చెప్పారు. బోడే ప్రసాద్ , బాలశౌరిలకు సైకిల్, గాజు గ్లాస్ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

AP Election 2024: రాజమండ్రిలో ఎన్డీఏ ఉమ్మడి సభ.. పాల్గొన్న ప్రధాని మోదీ

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 06 , 2024 | 10:46 PM