Share News

AP NEWS: వాడివేడిగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

ABN , Publish Date - Feb 06 , 2024 | 06:58 PM

జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశం వాడి వేడిగా జరిగింది. పట్టణంలో ఉన్న పలు సమస్యలపై మున్సిపల్ అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు.

AP NEWS: వాడివేడిగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశం వాడి వేడిగా జరిగింది. పట్టణంలో ఉన్న పలు సమస్యలపై మున్సిపల్ అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు. పలు ప్రాంతాలల్లో అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జేపీ సెంటర్ నుంచి త్రివేణి కాలేజీ వరకు తవ్వేసి వదిలేసిన రోడ్డు పరిస్థితి ఏమిటని నిలదీశారు. వార్డులకు మీరేమి అభివృద్ధి చేశారని తమను ప్రజలు ప్రశ్నిస్తున్నారని కౌన్సిలర్లు అన్నారు.

రహదారిని తవ్వేయడం వల్ల పలువురు గాయాల పాలవుతు న్నారని అన్నారు. వార్డుల్లో అభివృద్ధి జరగకపోవడంతో ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలంటూ అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు. ఎలక్షన్ కోడ్ అమలుల్లోకి వస్తే అభివృద్ధి పనులు ముందుకు జరుగుతాయా అంటూ ప్రశ్నలు సంధించారు. రహదారి నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు కౌన్సిలర్లకు తెలిపారు.

Updated Date - Feb 06 , 2024 | 06:58 PM