Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Janasena: ఆ ఇద్దరు కాపు నేతలు అలా చేయొద్దు.. జనసేన నేత వార్నింగ్

ABN , Publish Date - Mar 03 , 2024 | 06:40 PM

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)పై వ్యక్తిగతంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే తాము కూడా కాపు సంఘం నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంపై వ్యక్తిగతంగా మాట్లాడతామని జనసేన పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు(Govinda Rao) హెచ్చరించారు.

Janasena: ఆ ఇద్దరు కాపు నేతలు అలా చేయొద్దు.. జనసేన నేత వార్నింగ్

పశ్చిమగోదావరి జిల్లా: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)పై వ్యక్తిగతంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే తాము కూడా కాపు సంఘం నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంపై వ్యక్తిగతంగా మాట్లాడతామని జనసేన పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు(Govinda Rao) హెచ్చరించారు. ఆదివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంపై తీవ్ర విమర్శలు చేశారు. వీళ్లు పెద్దలని ఒక సామాజిక వర్గం గురించి పోరాడుతున్నారని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కులంతో ఎన్నికల్లో నెగ్గుతుందని తాను అనుకోవడం లేదన్నారు. వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన కాపులకి ముఖ్యమంత్రి ఇచ్చేస్తారా అని నిలదీశారు.

కాపులకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్ష ఉందని.. మరి వైసీపీలోకి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సీఎం జగన్ కాపులకు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పారా అని నిలదీశారు. వారు ఎందుకు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఈ నాయకులంతా కాపులను వెనక్కి నెట్టెస్తున్నారని బలంగా నమ్ముతున్నానని అన్నారు. ఈ ఆలోచనా విధానం తప్పని.. కొడుకునే ఆపుకోలేని హరిరామజోగయ్య పార్టీకి సలహాలు ఇవ్వడం కరెక్ట్ కాదని తేల్చిచెప్పారు. వైసీపీ దొంగల పార్టీ, దొంగతనాలు, కన్నాలు వేసేవాళ్లే ఆ పార్టీలో ఉంటారని సూర్యప్రకాష్ గతంలో ఓ వీడియో పెట్టాడని.. ఇప్పుడు ఆ పార్టీలోకి సూర్యప్రకాశ్ ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో, జిల్లాలో ఏమాత్రం ప్రభావితం లేని వ్యక్తి సూర్యప్రకాష్ అని మండిపడ్డారు. జోగయ్య కుమారుడు అనే గుర్తింపు తప్ప వేరే గుర్తింపు అతనికి లేదని గోవిందరావు చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2024 | 06:58 PM