Share News

TDP: 5, 6 తేదీల్లో చంద్రబాబు ఏయే జిల్లాల్లో పర్యటించనున్నారంటే..?

ABN , Publish Date - Feb 03 , 2024 | 06:04 PM

ఏపీలో ఎన్నికల కొలాహలం మొదలైంది. ప్రధాన పార్టీల మధ్య రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) వరుసగా సభల్లో పాల్గొంటూ ఆ పార్టీ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపుతున్నారు.

TDP: 5, 6 తేదీల్లో చంద్రబాబు ఏయే జిల్లాల్లో పర్యటించనున్నారంటే..?

అమరావతి: ఏపీలో ఎన్నికల కొలాహలం మొదలైంది. ప్రధాన పార్టీల మధ్య రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) వరుసగా సభల్లో పాల్గొంటూ ఆ పార్టీ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాబోయే ఎన్నికలపై టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార వైసీపీని ఎలా ఢీకొట్టాలనే దానిపై నేతలు, కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే దిశలో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ‘‘రా.. కదలి రా’’ పేరుతో ఏపీ వ్యాప్తంగా సభలతో టీడీపీ దూసుకెళ్తుంది.

ఈ క్రమంలోనే 5, 6 తేదీల్లో మూడు చోట్ల నిర్వహించే ‘రా.. కదలి రా’ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. 5వ తేదీన అనకాపల్లి పార్లమెంట్ మాడుగుల, ఏలూరు పార్లమెంట్ చింతలపూడిలలో టీడీపీ అధినేత పాల్గొంటారు. 6వ తేదీన చిత్తూరు పార్లమెంట్‌లోని జి.డి. నెల్లూరులో మూడు సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ‘‘రా.. కదలి రా’’ సభలను నిర్వహించారు.

ఆదివారం ఉండవల్లికి చంద్రబాబు

రేపు ఉదయం 10.30 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతి రానున్నారు. ఉదయం 9.15 గంటలకు హెలికాప్టర్‌లో నేరుగా ఉండవల్లి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు.రేపు(ఆదివారం) మధ్యాహ్నం తర్వాత టీడీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాలని టీడీపీ ఎమ్మెల్యే లు నిర్ణయం తీసుకున్నారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం వరకు కొంతమంది నేతలు చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - Feb 03 , 2024 | 06:32 PM