Share News

Mudragada: వైసీపీలో చేరడానికి ముందే ముద్రగడకు మరో అవమానం

ABN , Publish Date - Mar 13 , 2024 | 12:44 PM

కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మరో అవమానం జరిగింది. ఈనెల 14న (గురువారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆరోజు 10 వేల కార్లు..జనాలు తనవెంట రావాలని ఇటీవల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

Mudragada: వైసీపీలో చేరడానికి ముందే  ముద్రగడకు మరో అవమానం

కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)లో చేరడానికి ముందే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు (Mudragada Padmanabham) మరో అవమానం (Shame) జరిగింది. ఈనెల 14న (గురువారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సమక్షంలో వైసీపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆరోజు 10 వేల కార్లు..జనాలు తనవెంట రావాలని ఇటీవల ప్రజలకు బహిరంగ లేఖ (Letter) రాశారు. మళ్ళీ ఇప్పుడు ముద్రగడ మాట మార్చి మరో లేఖ విడుదల చేసారు. భారీస్థాయిలో జనం వస్తే జగన్‌కు భద్రత సమస్య వస్తుందంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఎక్కువమంది వస్తే కూర్చోడా నికి, నిలబడడానికి స్థలం సరిపోదని ఆ లేఖలో పేర్కొన్నారు. సీఎం వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందని ఆ లేఖలో వెల్లడించారు. అందువల్ల తాడేపల్లికి భారీ ర్యాలీ రద్దు చేసుకున్నట్లు లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.

ఈ నెల 15 లేదా 16న తానొక్కడినే తాడేపల్లి వెళ్ళి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ముద్రగడ బలప్రదర్శనను కావాలనే వైసీపీ అధిష్టానం నిరాకరించినట్లు ముద్రగడ అనుచరుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలం కిందట అమరావతిలో జగన్ అపాయింట్మెంట్ కోసం ముద్రగడ రోజుల తరబడి నిరీక్షించారు. ఆ తర్వాత అవమానంతో ముద్రగడ తిరిగి వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు భద్రత సమస్య సాకుతో ముద్రగడను సీఎం జగన్ మరోసారి అవమానించారు.

Updated Date - Mar 13 , 2024 | 12:46 PM