Share News

AP BJP: ప్రధాని మోదీకి బీజేపీ అసంతృప్త నేతలు లేఖ.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 15 , 2024 | 07:33 PM

ప్రధాని మోదీ, బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏపీ బీజేపీలోని అసంతృప్తి నేతలు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ ఏపీలో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీజేపీకి సీట్లు కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకి అన్యాయం జరుగుతుందని లేఖలో తెలిపారు.

AP BJP: ప్రధాని మోదీకి బీజేపీ అసంతృప్త నేతలు లేఖ.. కారణమిదే..?

అమరావతి: ప్రధాని మోదీ, బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏపీ బీజేపీలోని అసంతృప్తి నేతలు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ ఏపీలో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీజేపీకి సీట్లు కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకి అన్యాయం జరుగుతుందని లేఖలో తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని పని చేసేవారిని విస్మరించి తెలుగుదేశం నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారని అన్నారు. గతంలో టీడీపీ ఓటమి చెందిన స్థానాలనే ఇప్పుడు బీజేపీకి కేటాయించారని బీజేపీ రాష్ట్ర నేతలు చెప్పారు.ఈ స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కూడా చాలా తక్కువుగా ఉన్నాయని నడ్డా దృష్టికి తీసుకెళ్తూ బీజేపీ అసంతృప్తి నేతలు లేఖలో వివరించారు.

టీడీపీతో గతంలో పొత్తు పెట్టుకోవడంతో ఆంధ్రాలో బీజేపీ దెబ్బ తిన్న విషయాన్ని అసంతృప్తి నేతలు వివరించారు. సిద్ధాంతాలపై పార్టీ కోసం పని చేసిన వారి జాబితా ఇచ్చినా.. పరిగణనలోకి తీసుకోలేదని అసంతృప్తి నేతలు తెలిపారు. బీజేపీ ఎంపిక చేస్తున్న అభ్యర్థులు, టీడీపీ వారి చేతుల్లో ఉన్నారని చెప్పారు. తాము రాసిన లేఖలోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 07:33 PM