Share News

AP Congress: ఢిల్లీలో వైఎస్ షర్మిల ధర్నా షురూ..

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:35 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఏపీభవన్‌లో ఏపీ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ధర్నాకు మద్దుతు తెలిపారు.

AP Congress: ఢిల్లీలో వైఎస్ షర్మిల ధర్నా షురూ..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (AP Special Status), విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఏపీ భవన్‌లో ఏపీ కాంగ్రెస్ నేతలు (AP Congress leaders) శుక్రవారం ధర్నా చేపట్టారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (APCC Chief YS Sharmila) నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ధర్నాకు మద్దుతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. సాధిస్తాం ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అంటూ కాంగ్రెస్ నేతల నినాదాలు హోరెత్తాయి. ఈ ధర్నాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రెడ్డితో (APCC Chief YS Sharmilar reddy) పాటు సీనియర్ నేతలు రఘువీరారెడ్డి (Raghuveera Reddy), కేవీపీ (KVP), జేడీ శీలం (JD Seelam), ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్ర రాజు (Gidugu Rudraraju), సుంకర పద్మశ్రీ (Sunkara Padma Sri), మస్తాన్ వలి (Mastan Vali), తులసి రెడ్డి (Tulasi Reddy) పలువురు నేతలు పాల్గొన్నారు.

కాగా... అంతకు ముందుకు ఏపీసీసీ చీఫ్ షర్మిల ధర్నా కోసం ఏపీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తుండగా ఏపీ భవన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ధర్నా చేయడం కుదరదని వెల్లడించారు. దీంతో అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 02 , 2024 | 03:39 PM