Share News

Bank Accounts: బ్యాంకు ఖాతాల వివరాలు విదేశాలకు..

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:42 AM

సోషల్‌ మీడియాలో ఫేక్‌ మెసేజ్‌లు పెట్టి.. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, ట్రేడింగ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ యాప్‌లతో వల పన్నుతారు. మాయమాటలతో కమీషన్ల ఆశ చూపి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తారు.

Bank Accounts: బ్యాంకు ఖాతాల వివరాలు విదేశాలకు..
Bank Accounts

  • కమీషన్ల వల వేసి వివరాలు సేకరణ...

  • విదేశాల్లో నేరగాళ్లకు విక్రయం

  • చైనా, కంబోడియా నుంచి సైబర్‌ నేరాలు..

  • నలుగురి అరెస్టు

ఎండాడ(విశాఖపట్నం), మార్చి 26: సోషల్‌ మీడియాలో(Social Media) ఫేక్‌ మెసేజ్‌లు పెట్టి.. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, ట్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌లతో వల పన్నుతారు. మాయమాటలతో కమీషన్ల ఆశ చూపి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తారు. ఆ వివరాలను విదేశాల్లోని సైబర్‌ నేరగాళ్లకు(Cyber Thieves) అమ్మేస్తారు. కొన్ని రోజులుగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న నలుగురిని సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని(Telangana) కరీంనగర్‌కు(Karimnagar) చెందిన మాతంగి ప్రశాంత్‌(30), మాతంగి కుమార్‌(27), పెరుమండ్ల అశోక్‌(20) ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన త్రిపురామల్లు శ్రీనాగ రమేశ్‌(31).. వాట్సాప్‌, టెలిగ్రామ్‌తో పాటు పలు రకాల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, ట్రేడింగ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ యాప్‌లను పరిచయం చేస్తారు. వీటిలో జాయిన్‌ అయితే కమీషన్లు ఇస్తామని ఆశ చూపి వారి వారి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి.. వాటిని ఇతర దేశాల్లోని సైబర్‌ నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు.

దీనిపై పలు ఫిర్యాదులు అందడంతోపాటు, నగరంలోని కొంతమంది బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు ఫేక్‌ నంబర్లతో సోషల్‌ మీడియా ద్వారా మెసేజ్‌లు పంపుతుంటారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, ట్రేడింగ్‌ ఇన్వె్‌స్టమెంట్‌కు సంబంధించిన యాప్‌లతో వల వేస్తుంటారన్నారు. కమీషన్‌ ఇస్తామని ఆశ చూపి వాటికి స్పందించే వారి బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు సేకరిస్తారు. వివరాలు ఇచ్చిన వారికి కొంత డబ్బు జమ చేసి నమ్మకం కలిగిస్తారు.

ఆ తర్వాత ఆ ఖాతాలకు లింక్‌ అయిన ఫోన్‌ నంబర్లను మార్చేసి ఆయా ఖాతాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటారు. ఆపై ఆ వివరాలను ఇతర దేశాల్లోని సైబర్‌ నేరగాళ్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ఆ ఖాతాలను వినియోగించి చైనా, కంబోడియా తదితర దేశాలకు చెందినవారు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌, జాయింట్‌ పోలీసు కమిషనర్‌ ఫకీరప్ప సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 08:32 AM