Share News

Babu Rao: సీపీఎం నేత బాబురావు అరెస్ట్.. విజయవాడ నుంచి మైలవరం పీఎస్ తరలింపు

ABN , Publish Date - Jan 22 , 2024 | 08:06 AM

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీలు తమ సమస్యల కోసం ఆందోళనకు దిగారు. అంగన్ వాడీలకు సీపీఎం నేత బాబురావు మద్దతు ప్రకటించారు. అంగన్ వాడీలతో కలిసి ఆందోళన చేపట్టేందుకు రాగా విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Babu Rao: సీపీఎం నేత బాబురావు అరెస్ట్.. విజయవాడ నుంచి మైలవరం పీఎస్ తరలింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీలు తమ సమస్యల కోసం ఆందోళనకు దిగారు. అంగన్ వాడీలకు రాజకీయ పార్టీలు, కమ్యునిస్టులు, ప్రజా సంఘాల నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. వారికి అండగా నిలుస్తానని సీపీఎం నేత బాబురావు (Babu Rao) ప్రకటించారు. అంగన్ వాడీలతో కలిసి ఆందోళన చేపట్టేందుకు రాగా విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మైలవరం పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసుల వైఖరిని బాబు రావు ఖండించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

తన మొబైల్ లాక్కున్నారని చెబుతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి సన్నిహితులకు సమచారం ఇవ్వడం లేదని బాబు రావు ధ్వజమెత్తారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ దీక్ష చేపట్టారు. భోజనం చేయడం లేదు. బాబురావును ఆదివారం రాత్రి 7 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 11 గంటల వరకు ఆయన ఎక్కడ ఉన్నారో సమాచారం ఇవ్వలేదు. దీంతో సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల వైఖరిని సీపీఎం నేతలు ఖండించారు. బాబురావును వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావు డిమాండ్ చేశారు.

తమ వేతనం పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. విధుల్లో చేరాలని అంగన్ వాడీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. డిమాండ్లపై అంగన్‌వాడీలు వెనక్కి తగ్గలేదు. దీంతో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీంతో 10 శాతం లోపు సిబ్బంది విధుల్లో చేరారు. మిగిలిన వారిని ఉద్యోగం నుంచి తీసివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి కసరత్తు చేస్తోందని విశ్వసనీయ సమాచారం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 22 , 2024 | 08:06 AM