Share News

‘ప్రజలపై కాదు.. మాఫియాపై దాడులు చేయండి’

ABN , Publish Date - Apr 04 , 2024 | 08:34 PM

రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న సాండ్, ల్యాండ్, గ్రావెల్ మాఫియాపై దాడులు చేయాలని ఉన్నతాధికారులకు అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సూచించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో ప్రజలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

‘ప్రజలపై కాదు.. మాఫియాపై దాడులు చేయండి’

అనకపల్లి, ఏప్రిల్ 04: రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న సాండ్, ల్యాండ్, గ్రావెల్ మాఫియాపై దాడులు చేయాలని ఉన్నతాధికారులకు అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సూచించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో ప్రజలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్య ఉన్నా.. తన దృష్టికి తీసుకు వస్తే తక్షణమే స్పందిస్తానని ఈ సందర్బంగా ప్రజలకు సీఎం రమేష్ హామీ ఇచ్చారు.

అయితే అనకాపల్లి జిల్లాలోని చోడవరం గాంధీ గ్రామంలో టైల్స్‌షాప్‌పై గురువారం సేల్స్ ట్యాక్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిపై షాప్ యజమాని బుచ్చిబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ.. రౌడీల మాదిరిగా ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి.. సీసీ కెమెరాలు సైతం ఆప్ చేశారన్నారు. అంతేకాకుండా రూ. 25 లక్షలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ అధికారులు తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తనతో సేల్ టాక్స్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, బీజేపీ నాయకుడు సీఎం రమేష్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వెంటనే బుచ్చిబాబు వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అందులోభాగంగా ఈ జగన్ ప్రభుత్వ హయాంలో సాండ్, ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుందని.. వాటిని నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టాలంటూ ఈ సందర్బంగా ఉన్నతాధికారులకు సీఎం రమేష్ సూచించారు.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

AP Elections: నాడు నెల్లూరులో ఏర్పడిన అల్పపీడనమే..

AP News: స్కిల్ కేసులో ఛార్జీ షీట్ దాఖలు చేసిన ఏసీబీ

Updated Date - Apr 04 , 2024 | 08:39 PM