Share News

AP Politics: ఇంచార్జీల ఐదో జాబితా రెడీ.. వైసీపీ నేతల్లో గుబులు

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:19 PM

రాష్ట్రంలో పలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఇంచార్జీల మార్పులతో ఐదో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

AP Politics: ఇంచార్జీల ఐదో జాబితా రెడీ.. వైసీపీ నేతల్లో గుబులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఇంచార్జీల మార్పులతో ఐదో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎంవో నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. నియోజకవర్గ ఇంచార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం తాడేపల్లికి పిలిపించారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ కు నేతలు క్యూ కట్టారు.

ఇంచార్జీల మార్పుల్లో భాగంగా సీఎం జగన్ ఇప్పటికే 59 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల అభ్యర్థులను మార్చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో ఇంచార్జీల మార్పుల వల్ల వర్గ విభేదాలు భగ్గుముంటున్నాయి. ఇప్పటి వరకు తాము నాయకుల కోసం కష్టపడి పని చేశామని కాని కొత్తగా వచ్చే వారి దగ్గర ఉండాలంటే కష్టంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సీఎంవోకి వచ్చిన వారిలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్, మంత్రి ఉష శ్రీ చరణ్, మాజీ మంత్రి కూరసాల కన్నబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సారి ఎంత మందిపై వేటు పడుతుందోనని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

"మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి"

Updated Date - Jan 30 , 2024 | 04:22 PM