Share News

CM Jagan: రేపు 2200మంది వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం

ABN , Publish Date - Feb 26 , 2024 | 04:17 PM

Andhrapradesh: రాష్ట్ర వ్యప్తంగా ఉన్న 2200 మంది వైసీపీ నేతలలో రేపు (మంగళవారం) మంగళగిరి సికే కన్వేన్షన్ సెంటర్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్‌లతో ముఖ్యమంత్రి సమావేశం అవనున్నారు. అసెంబ్లీ పరిశీలకులు, జేసీఎస్ కో ఆర్డినేటర్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ అసెంబ్లీ, మండల ఇంచార్జ్‌లతోనూ సమావేశంకానున్నారు.

CM Jagan: రేపు 2200మంది వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం

అమరావతి, ఫిబ్రవరి 26: రాష్ట్ర వ్యప్తంగా ఉన్న 2200 మంది వైసీపీ నేతలలో రేపు (మంగళవారం) మంగళగిరి సికే కన్వేన్షన్ సెంటర్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్‌లతో ముఖ్యమంత్రి సమావేశం అవనున్నారు. అసెంబ్లీ పరిశీలకులు, జేసీఎస్ కో ఆర్డినేటర్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ అసెంబ్లీ, మండల ఇంచార్జ్‌లతోనూ సమావేశంకానున్నారు. ఎన్నికల నిర్వహణ, కార్యాచరణకు సంభందించి ఈ సమావేశంలో నేతకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గం నుంచి 10 నుంచి 12 మంది బూత్ ఆర్గ నైజర్లకు ఆహ్వానం వెళ్లింది. సీఎం జగన్‌తో సమావేశం అనంతరం ఐప్యాక్ టీంతో ప్రత్యేక శిక్షణ ఉండనుంది. చాలా కాలం తరువాత సీఎం స్వయంగా నాయకులతో ఇంటరాక్ట్ అయ్యే సమావేశం ఇది. దీంతో సీటు మారిన, సీటు చిరిగిన ఎమ్మెల్యేలు అసంతృప్త స్వరాలు వినిపించకుండా జాగ్రత్తలు పడే అవకాశం ఉంది. అలాంటి వారిని బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా వైసీపీ పూర్తిస్ధాయి జాబితాపైనా సీఎం కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. కసరత్తు తుదిదశకు చేరుకోవడంతో వారం పదిరోజుల్లో మొత్తం జాబితా వెల్లడికి సన్నాహకాలు జరుగుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 04:17 PM