Share News

Tirupati: ఆయన అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞను నిజం చేస్తాం: సుగుణమ్మ

ABN , Publish Date - Apr 01 , 2024 | 12:08 PM

తిరుపతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశయ సాధన కోసం ఆయన అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞను నిజం చేయడం కోసం మహా కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేస్తామని తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ సుగుణమ్మ స్పష్టం చేశారు.

Tirupati: ఆయన అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞను నిజం చేస్తాం: సుగుణమ్మ

తిరుపతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు (TDP National President) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆశయ సాధన కోసం ఆయన అసెంబ్లీలో ఆయన చేసిన ప్రతిజ్ఞను నిజం చేయడం కోసం మహా కూటమి జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు (Arani Srinivasulu) గెలుపు కోసం పనిచేస్తామని తిరుపతి (Tirupati) టీడీపీ ఇన్చార్జ్ సుగుణమ్మ (Sugunamma) స్పష్టం చేశారు. సోమవారం జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు సుగుణమ్మ ఇంట్లో భేటీ అయ్యారు. ఈరోజు వరకు ఎడమొహం పేడమొహంగా ఉన్న టీడీపీ (TDP), జనసేన నేతలు (Jenasena Leaders) ఈ భేటీతో ఏకమయ్యారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం టీడీపీకి చెందిన అందరీ నేతల సహకారం తీసుకుంటామన్నారు. మహాకూటమి (Mahakutami) విజయం దశగా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు. పొత్తుల్లో భాగంగా తిరుపతి జనసేనకు కేటాయించడం జరిగిందన్నారు. చంద్రబాబు (Chandrababu) ఆశయం మేరకు.. ఆయన అసెంబ్లీలో చేసిన శపథం నెరవేర్చే దిశగా మనమంతా అహర్నిశలు కష్టబడి బాబు చేసిన ప్రతిజ్ఞను సజావు చేయాల్సిన అవసరం ఉందని సుగుణమ్మ వ్యాఖ్యానించారు.

జనసేన తిరుపతి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలతో కూడిన వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించి పాలనను గాడిలో పెట్టడానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహా కూటమి ఏర్పడిందన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో తోసి అంతం చేయడమే ఈ కూటమి లక్ష్యయమని అన్నారు. చంద్రబాబు నాయుడుని మరోసారి ముఖ్యమంత్రిని చేయటం తథ్యమని, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌ అభినయ రెడ్డి చేసిన అక్రమాలను కక్కిస్తామన్నారు. తిరుపతిలోని టీడీపీ నేతలతో పాటు, ఇన్చార్జి సుగుణమ్మ ఆశీస్సులు, సూచనలు, సలహాలు తీసుకొని నడుచుకుంటామన్నారు. తిరుపతి ప్రజలను గెలిపించటానికి సుగుణమ్మ జనసేనకు మద్దతుగా తెలిపినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ అన్నారు.

Updated Date - Apr 01 , 2024 | 12:50 PM