Share News

CM Jagan: జగన్ కుప్పం పర్యటనతో జనం అవస్థలు..

ABN , Publish Date - Feb 26 , 2024 | 09:48 AM

నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం పర్యటనతో ప్రజల అవస్థలు పడుతున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుండు శెట్టిపల్లి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. సీఎం పర్యటనతో పలమనేరు కుప్పం హైవే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. గ్రామాల మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

CM Jagan: జగన్ కుప్పం పర్యటనతో జనం అవస్థలు..

చిత్తూరు: నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కుప్పం (Kuppam) నియోజకవర్గం పర్యటనతో ప్రజల అవస్థలు పడుతున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుండు శెట్టిపల్లి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. సీఎం పర్యటనతో పలమనేరు - కుప్పం హైవే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. గ్రామాల మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. సీఎం సభకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాన్ని ఆర్టీసీ (RTC) బస్సులు, ప్రైవేట్ బస్సుల్లో తరలిస్తున్నారు.

జగన్ కుప్పం పర్యటనతో బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నుంచి అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల తరలింపునకు మళ్లించనున్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సులను కూడా భారీగా మళ్లిస్తున్నారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీనీవా జలాలను జగన్ ప్రారంభించనున్నారు. రెండు చోట్లా హెలిపాడ్ ఏర్పాటు అనేది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 09:48 AM