Share News

TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. కీలక నిర్ణయాలివే..

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:20 PM

Andhrapradesh: టీటీడీ ఉద్యోగులకు పాలకమండలి శుభవార్త చెప్పింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9 వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. కీలక నిర్ణయాలివే..

తిరుమల, ఫిబ్రవరి 26: టీటీడీ ఉద్యోగులకు (TTD Employees) పాలకమండలి శుభవార్త చెప్పింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9 వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచుతూ టీటీడీ (TTD) పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

TTD: రమణ దీక్షితులుపై టీటీడీ వేటు



టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే..

  • గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇక నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం.

  • తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం.

  • శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం.

  • రూ.4 కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బొట్టులు తయారీ.. నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయింపు.

  • ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం.

  • ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం.

  • అటవీ కార్మికుల జీతాలు పెంపు..

  • వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లింపు.

  • రూ.3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటు.

  • అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం..

  • రూ.1.8 కోట్లు ఇచ్చేందుకు సముఖుత వ్యక్తం చేసిన శేఖర్ రెడ్డి.

  • 15 పోటు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదన.

  • రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిధిగృహం ఆధునికరణ.

  • రూ. 3.15 కోట్లతో తిరుమల్లోని జలాశయ్యాలో ఉన్న 682 మోటార్ పంపులు మార్పు.

  • తిరుమల్లోని అతిధి గృహాలు, యాత్రి సదన్ ఎఫ్ఎంఎస్ సేవలు 3సంవత్సరాలు పొడిగింపు..

  • తిరుపతిలోని జీటీ ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవ నూతన బంగారు కవచాలు.

  • రూ.15 లక్షలతో తండ్లకు బంగారు తాపడం.

  • వెంకటశివ కృష్ణ ప్రసాద్ పదవి కాలం మూడు సంవత్సరాలు పెంపు.

  • తాగునీటి అవసరాల కోసం ముగ్గు బావి ఆధునికరణ.

  • జమ్మూలోని సిబ్బంది హెచ్‌ఆర్‌ఏ పెంపు..

  • తిరుపతిలోని హరేరామ హరేకృష్ణా రోడ్డులో రూ.7.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం.

  • రూ.3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత బుక్‌ల ప్రింటింగ్.

  • స్విమ్స్‌లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు.

  • టీటీడీలోని అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రాయితీ పై భోజన సదుపాయం..

  • రూ.8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం..

  • అన్నదానంలో రూ.3 కోట్లతో వస్తువులు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం..

  • సూపెర్వైజర్ పోస్టులతో పాటు క్రింద స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం..

  • కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం.

  • కళ్యాణం నిర్వహణకు ఆమోదం.

  • టీటీడీలోని క్రింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయం..

  • టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 02:08 PM