Share News

TDP: సీఎం జగన్ వల్లే ఆ కంపెనీలు తరలి పోయాయి: గాలి భాను ప్రకాష్

ABN , Publish Date - Feb 19 , 2024 | 06:45 PM

సీఎం జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు ‘సిద్ధం’ సభలో హేళనగా మాట్లాడడం తప్ప రాయలసీమ అభివృద్ధి విషయంలో ఏమి చేశారో చెప్పలేదని నగరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి గాలి భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) అన్నారు.

TDP: సీఎం జగన్ వల్లే ఆ కంపెనీలు తరలి పోయాయి: గాలి భాను ప్రకాష్

తిరుపతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు ‘సిద్ధం’ సభలో హేళనగా మాట్లాడడం తప్ప రాయలసీమ అభివృద్ధి విషయంలో ఏమి చేశారో చెప్పలేదని నగరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి గాలి భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) అన్నారు. పుత్తూరులో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఈ సభలో సీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి జగన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. 102 ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు ఎందుకు ప్రీక్లోజర్ అయ్యాయో తెలియదన్నారు. సీఎం జగన్ సొంత జిల్లాల్లో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి ఊసే లేదని చెప్పారు.

డ్రిప్ ఇరిగేషన్‌ను ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని నిలదీశారు. కర్నూల్ మెగా సీడ్‌ పార్క్‌ ఎందుకు వెళ్లిపోయిందని నిలదీశారు. పది వేల మందికి ఉపాధిని ఇచ్చే అమర్ రాజాని ఏపీ నుంచి ఎందుకు గెంటేశారని ప్రశ్నించారు. జాకీ కంపెనీ ఏపీ నుంచి ఎందుకు వెళ్లిపోయిందో చెప్పాలన్నారు. హంద్రీ నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు ఏమయ్యాయని అడిగారు. అన్నిటికీ మించి కర్నూల్‌లో పెట్టే న్యాయ రాజధానిని ఇంకా ఎందుకు నిర్మించడం లేదని గాలి భాను ప్రకాష్ ప్రశ్నించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 06:46 PM