Share News

AP NEWS: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహణలో వైసీపీ అరాచకం

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:55 PM

జల్లికట్టు ( Jallikattu ) నిర్వహణలో వైసీపీ ( YCP ) అరాచకం సృష్టించింది. జిల్లాలోని గుడిపల్లి మండలంలోని కోటచంబగిరి గ్రామంలో పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి జల్లికట్టును నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు.

AP NEWS: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహణలో వైసీపీ అరాచకం

చిత్తూరు: జల్లికట్టు ( Jallikattu ) నిర్వహణలో వైసీపీ ( YCP ) అరాచకం సృష్టించింది. జిల్లాలోని గుడిపల్లి మండలంలోని కోటచంబగిరి గ్రామంలో పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కలిసి జల్లికట్టును నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇదంతా తామే చేసినట్లుగా వైసీపీ నేతలు గొప్పలకు పోయారు.. అలాగే ఇందుకు సంబంధించి వైసీపీ బ్యానర్లను కూడా కట్టారు. దీంతో గ్రామస్తులు మూకుమ్మడిగా వైసీపీ నేతల చర్యలను ఖండించారు.

వైసీపీ బ్యానర్లు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారని పలువురు గ్రామస్తులు వైసీపీ శ్రేణులను నిలదీశారు. జల్లికట్టును తామే నిర్వహిస్తున్నామని వైసీపీకి చెందిన పలువురు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాహకులైన నగేష్, మురగ రాజ్‌పై వలంటీర్ భర్త సోముతో పాటు వైసీపీకి చెందిన సంజయ్, నవీన్, రాజేంద్రలు రాళ్లతో దాడి చేశారు.ఈ దాడిలో నగేష్, మురుగరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.

Updated Date - Jan 17 , 2024 | 04:24 PM