Share News

Chandrababu Naidu Live : పేదలతోనే ఉంటా.. పేదల కష్టాలు తీరే వరకూ పోరాడతా..

ABN , First Publish Date - Mar 30 , 2024 | 04:52 PM

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ప్రజాగళం యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కూటమి అభ్యర్ధి నెలవల విజయశ్రీ, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Chandrababu Naidu Live : పేదలతోనే ఉంటా.. పేదల కష్టాలు తీరే వరకూ పోరాడతా..

Live News & Update

  • 2024-03-30T18:45:47+05:30

    తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ప్రజాగళం యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కూటమి అభ్యర్ధి నెలవల విజయశ్రీ, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, ప్రజలు తరలి వచ్చారు. దీంతో నాయుడుపేట రహదారులు జనంతో కిక్కిరిసిపోయి పసుపుమయంగా మారాయి.

  • 2024-03-30T17:15:09+05:30

    జగన్ ట్రాప్ లో వాలంటీర్లు పడొద్దని చంద్రబాబు నాయుడు సూచించారు. అందరికీ న్యాయం చేస్తానన్నారు. బాగా చదువుకున్న వారందరికీ రూ.5వేలు కాదు రూ.50వేలు, లక్ష సంపాదించే మార్గం చూపిస్తానని చెప్పారు. వైసీపీ ఏ పని చేసినా, ఏ స్కీం తెచ్చినా అందులో పెద్ద స్కాం ఉంటుందని విమర్శించారు. రూ.60 ఉన్న మద్యం సీసా ఇప్పుడు రూ.220 అయిందన్నారు. జలగలా జగన్ ప్రజల రక్తం తాగుతున్నారని ఫైర్ అయ్యారు. ఏపీలో మద్యం బ్రాండులు ప్రపంచంలో ఎక్కడా ఉండవని ఎద్దేవా చేశారు. ఈ మద్యం తాగడం వల్ల ఆరోగ్యం, జేబులు గుల్లయ్యాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

  • 2024-03-30T17:00:26+05:30

    "ఒక సీఎం విధ్వంసకారైతే, దుర్మార్గుడైతే ఏ వర్గం బాగుండదు. పిల్లలని బాగా చదివించి, ప్రపంచాన్ని‌ శాసించే స్థాయికి‌ వచ్చాం. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలని తీసుకువచ్చాం. జగన్ ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? నన్ను చూసి పరిశ్రమలు వస్తాయి. జగన్ ను చూస్తే భూంభూం వస్తుంది. జగన్ అబద్దాలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారికి ఎమ్మెల్యే సీటు, దుర్మార్గాలు చేసే వారికి ఎంపీ సీటు ఇస్తున్నారు. సైకో జగన్ నీకు తెలియదు. నువ్వు బవ్చాగా గోలీ కాయలు ఆడుకున్నప్పుడే నేను సీఎం అయ్యా. మీ నాన్నకంటే ముందు సీఎం అయ్యా. ఆ విషయం గుర్తుంచుకో" అని చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.